ప్రస్తుతం పవన్ ‘జనసేన’ వెనుక ఉండి నడిపిస్తున శక్తి ఎవరు? అని ప్రశ్నిస్తే మరో మాటలేకుండా పివిపి నిర్మాణ సంస్థ అధినేత పోట్లురి వరప్రసాద్ పేరు ఎవరైనా చెపుతారు. అటువంటి ప్రసాద్ పవన్ ముఖ్య ఆంతరంగీకులలో ఒకరుగా అన్నిటా తానై పవన్ జనసేన వ్యవహారాలను చూస్తున్నాడు. అటువంటి ప్రసాద్ దృష్టి ప్రస్తుతం ‘లెజండ్’ వైపు పడింది అని అంటున్నారు. త్వరలో బాలకృష్ణతో ప్రముఖ నిర్మాణ సంస్ధ PVP వారు చిత్రం చేయనున్నారని సమాచారం. భారీగా రూపొందే ఈ చిత్రం బాలకృష్ణ వందో చిత్రంగా ఉంటుందని టాక్. అదేవిధంగా బాలకృష్ణ వందవ చిత్రాన్ని దర్శకత్వం వహించే బాధ్యతను బోయపాటికి పివిపి నిర్మాణ సంస్థ బాలయ్య అంగీకారంతో అప్పచెప్పినట్లు సమాచారం. బాలయ్యతో ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలను నిర్మించి బాలయ్యకు మరుపురాని హిట్స్ ఇచ్చిన బోయపాటికి కృతజ్ఞతగా బాలయ్య తన వందవ సినిమాను దర్శకత్వం వహించే అరుదైన అవకాశాన్ని బోయపటికి ఇచ్చాడు అని అంటున్నారు. ప్రస్తుతం బోయపాటి రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా పూర్తి అయిన తరువాత ఒక పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా వచ్చే సంవత్సరం ఉంటుంది అని అంటున్నారు. ఈ లోపున బాలయ్య తన 99వ చిత్రాన్ని సత్యదేవా దర్సకత్వంలో ఎన్నికల తరువాత మొదలు పెట్టి ఈ సంవత్సరాంతానికి పూర్తి చేస్తాడు అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే బోయపాటి టాప్ డైరెక్టర్స్ లిస్టులో నిలబడి పోయినట్లే అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: