మంచు వారి అబ్బాయ్ మంచు విష్ణు నిన్న ఒక ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో పాల్గొని కొన్ని సంచలన విషయాలు చెప్పాడు. తన దృష్టిలో తన తండ్రి దేవుడనీ చెపుతూ మోహన్ బాబు ఆస్తులు కూడ పెట్టు కోవడం కన్నా సినిమాల గురించే ఎక్కువ ఆలోచించి నష్ట పోయాడని అన్నాడు. తమ కుటుంబానికి మహాబలిపురం దగ్గర 40 ఎకరాల పొలం ఉండేదని ఇప్పుడు ఆ పొలం ఎకరా 15 కోట్లు పైన పలుకు తోందని సొంత సినిమాలు తీయడానికి ఆ ఆస్తిని కరిగించి మోహన్ బాబు సినిమాలు తీసారనీ చెప్పాడు విష్ణు. ఒక్పప్పుడు మోహన్ బాబు కెరియర్ కు బ్రేక్ ఇచ్చిన ‘అల్లుడుగారు’ సినిమా కోసం ఈ భూమి లోంచే దాదాపు 15 ఎకరాలు అమ్మి తన తండ్రి సినిమా తీసాడని చెప్పాడు. ఆ సినిమా విజయవంతం అయినా పెరిగిన ఆ భూమి విలువలతో పోల్చుకుంటే తమకు వచ్చిన లాభాలు చాల తక్కువ అని చెపుతూ ఆస్థులు కన్నా సినిమాలు పరపతి అంటేనే మోహన్ బాబుకు ప్రాణం అని చెప్పాడు విష్ణు. తన తండ్రి మాటలే కాదు కోపం వస్తే తనను, మనోజ్ ను మోహన్ బాబు చేయ చేసుకునే వాడనీ చెపుతూ తన తండ్రి ఎదిరించే దమ్ము ఒక్క లక్ష్మీ ప్రసన్నకే ఉంది అని అన్నాడు విష్ణు.  తమ సినిమాల కోసం ఎన్నో కోట్లు పోగొట్టుకున్న మోహన్ బాబు ఏనాడు ఆర్ధిక సమస్యల గురించి భయపడ లేదనీ ఇప్పటికీ తన పిల్లలను సూపర్ హీరోలుగా చూడాలని కోరుకుంటాడనీ అటువంటి తండ్రి తనకు లభించడం తన అదృష్టం అని అన్నాడు ఈ మంచు వారి అబ్బాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: