దక్షిణాది సినిమా రంగాన్ని క్వీన్ లా ఏలుతున్న హీరోయిన్ సమంత ‘క్వీన్' అనే హిందీ చిత్రం రీమేక్‌లో నటించబోతున్నట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్' హిందీ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిన విషయమే. ఇందులో కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్ చూసి బాలీవుడ్ మీడియా అంతా అదిరిపోయింది. ఈ సినిమా బాగుందని సమంత వ్యాఖ్యానించడంతో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా ద్వారా సమంత నిర్మాతగా మారుతుందనే గాసిప్స్ సైతం ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక అభిమాని ఈ విషయమై సమంతను ట్విట్టర్ ద్వారా వివరణ కోరాడు ‘క్వీన్' సినిమా రీమేక్‌లో మీరు నటిస్తారా? అని ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ ‘ఆ సినిమాను రీమేక్ చేస్తే ఒరిజినల్ వెర్షన్‌ను చెడగొట్టిన వాళ్లం అవుతాం. అలా చేయడం మంచిది కాదని నా భావన. అందుకే ఆ సినిమా జోలికి వెళ్లే ఉద్దేశ్యం నాకు లేదు' అని సమంత స్పష్టం చేసింది. దీనితో ‘క్వీన్’ సినిమాలో సమంత నటిస్తోంది అనే వార్తలకు తెరపడినా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు సమంత నటించలేదా అనే కొత్త ప్రశ్నలకు తెరలేచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: