ఆషికీ 2.... ఈ సినిమా లాస్ట్ ఇయర్ బాలీవుడ్ని మైమరిపిం చేసింది. అలాగని ఇదేదో ఎక్స్ పరిమెంటల్ మూవీనో.... డిఫరెంట్ మూవీనో కాదు. మామూలు లవ్ స్టోరి. కాకపోతే, మ్యూజికల్ గా ఇరగదీసింది. ఒకటి రెండూ కాదు.... మొత్తం అన్ని పాటలూ, అన్ని ట్యూన్స్ జనాన్ని ఓ ఊపు ఊపేసి వదిలాయి. ఆషికీ 2 సినిమాకి సంగీతమే కాదు... హీరోయిన్ శ్రద్ధా కపూర్ మరో పెద్ద అట్రాక్షన్. ఈ సినిమాతోనే హిందీ తెరపైకి వచ్చిన శ్రద్ధా ఒకే ఒక్క సినిమాతో మాయ చేసేసింది! ఆమె కోసం మళ్లీ మళ్లీ థియేటర్స్ కి వెళ్లిన యూత్ వున్నారు. శ్రద్ధా క్రేజ్ ని చూసి టాలీవుడ్ కూడా మనసు పారేసుకుంది. ఆమెని తమ సినిమాలో యాక్ట్ చేయించేందుకు చాలా మందే ఉత్సాహపడ్డారు. కాకపోతే... గబ్బర్ సింగ్ 2 సినిమా కోసం హీరోయిన్ వేటలో వున్న పవర్ స్టార్ కూడా ఈ ఆషీకి 2 బ్యూటికి ఫిదా కావటం.... నిజంగా సెన్సేషనే! గబ్బర్ సింగ్ 2 కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపిస్తూనే వున్నా ఆ మధ్య బలంగా వినిపించిన పేరు శ్రద్ధా కపూర్. అయితే, ఈ ముంబై మోనాలిసా డేట్స్ కుదరక గబ్బర్ సింగ్ మేకర్స్ వద్దనుకున్నారు. కాని, ఊహించని విధంగా గబ్బర్ సింగ్ 2 కి జనసేన స్ట్రోక్ తగిలి వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడూ పవన్ యాక్టివ్ పొలిటికల్ ఎంట్రీ 2019 దాకా వుండదని తేలిపోవటంతో మరోసారి గబ్బర్ సింగ్ 2 పైకి అందరి దృష్టి మళ్లీంది. దాంతో పాటే హీరోయిన్ ఎవరన్న క్వశ్చన్ కూడా మరోసారి మొదలైంది. అయితే, ఈసారి పవర్ స్టార్ ప్రాజెక్ట్ ని ఎలాగైనా చేసేందుకు శ్రద్ధ కూడా శ్రద్ధ చూపుతోందని టాక్. ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయగలిగితే.. పవన్ సరసన ఈ స్లిమ్ అండ్ సిజిలింగ్ బ్యూటీని భాగ్యలక్ష్మీ క్యారెక్టర్ లో మనం చూడొచ్చో? లేదో? అంటే మరి కొంత కాలం వెయిట్ చేయాలి. ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: