'అంజలి' హీరోయిన్ గా టాలీవుడ్ లో పెద్దగా క్లిక్ కాలేకపోయినా కోలీవుడ్ లో మాత్రం బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు చాలా కష్టాల్లో ఉందట. ఆ మధ్య ఇంత లావుగా ఉంటే ఆఫర్స్ ఎవరిస్తారు..? అనే టాక్ వినిపించడంతో అంజలి వెంటనే సన్నబడింది. దీంతో ఇప్పుడు ఆమెకు ఆఫర్స్ కూడా వస్తున్నాయి.. కానీ వాటిని ఓ నిర్మాత తొక్కేస్తున్నాడనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ ను ప్రత్యేకంగా ఏపిహెరాల్డ్.కామ్ మీకు అందిస్తుంది.  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేస్తున్న టైమ్ లో ఓ నిర్మాత ఆమె డేట్స్ ను బల్క్ గా కొనేశాడనే టాక్ వచ్చింది. అంటే అంజలితో సినిమా తీయాలంటే.. ముందుగా ఆ నిర్మాత అనుమతి తీసుకోవాలన్న మాట. ఈవిషయం పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. ఇప్పుడు ఈ కొత్త వ్యాపారపు ఒప్పందమే అంజలిని ఇబ్బంది పెడుతోందట. ఆ నిర్మాత ఎవరూ.. అనేదానిపై క్లారిటీ లేకపోయినా.. సినీ వర్గాలకు అతను ఎవరో తెలుసని టాక్. అయితే ఇప్పుడు సన్నగా మారి మంచి ఫిజిక్ బిల్డప్ చేసుకున్న అంజలికి వరుస ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ఆ నిర్మాత మాత్రం అంజలికి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావాలంటున్నాడట. దీంతో ఇప్పుడు అంజలి కెరీర్ సందిగ్ధంలో పడిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి అంజలిని అంతగా ఇబ్బంది పెడుతున్న నిర్మాత ఎవరూ..? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: