ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కొన్ని చిత్రాలు షూటింగ్ మధ్యలోనూ, షూటింగ్ ముగిసిన తరువాత రిలీజ్ కు నోచుకోకుండా ఆగిపోయాయి. వాటికి సంబంధించిన వివరాలను ఏపిహెరాల్డ్.ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. 'ఆటోనగర్ సూర్య'.. నాగచైతన్య హీరోగా, దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రం ఆది నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో మధ్యలో కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. తర్వాత మళ్లీ ప్రారంభించారు. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది. ఈ మూవీకి సంబంధించిన ఆర్థిక లావాదేవిల్లో సమస్యలు తలెత్తడంతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి. అలాగే మరో మూడు సినిమాలు పరిస్థితి ఉంది. కాకపోతే.. ఇవి ఆదిలోనే హంసపాదు లాగా అర్థంతరంగా ఆగిపోతున్నాయి. ఇంతకి ఆ సినిమాలెంటనేది ఓసారి చూస్తే.. వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో 'రాధా' అనే చిత్రం రీసెంట్ గానే ప్రారంభమైంది. షూటింగ్ కూడా శరవేగంగా ప్రారంభమవుతుందనుకున్న ఈ చిత్రం ఇప్పుడు అర్థాంతరంగా ఆగిపోయింది. సినిమా కథ విషయంలో వివాదం తలెత్తడంతో వెంకీ సినిమాకే ఫుల్ స్టాప్ పెట్టాడట. 'రాధా' ఇప్పుడొద్దని తేల్చి చెప్పాడట. దీంతో 'రాధా' కథ ముగిసినట్టేనని చెప్పవచ్చు. ఇక మరో చిత్రం 'దుర్గ'. నాగచైతన్య హీరోగా రీసెంట్ గానే ప్రారంభం జరుపుకున్న ఈ చిత్రం కూడా ఇప్పుడు ఆగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు శ్రీనివాస రెడ్డిపై నమ్మకం కుదరడం లేదంటూ నాగచైతన్య దర్శకుడిని మార్చే ప్రయత్నం చేశాడట. దీంతో మొత్తం సినిమానే నిలిచిపోయింది. ఇప్పుడు కొత్త దర్శకుడి కోసం వెతుకుతున్నా...ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా లేదు. ఇదిలా ఉంటే.. గోపీచంద్, బి. గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కూడా ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ పోలీసు క్యారెక్టర్ లో నటించే ఈ సినిమాలో నయనతార హీరోయిన్. గతేడాది ప్రారంభమైన ఈమూవీ ఇప్పుడు అర్థాంతరంగా వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే ఇది ఆగిపోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: