ఎన్నికల ప్రచారా రణరంగానికి తెర లేవడంతో ఎదో విధంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని సాధించాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి పవన్ కళ్యాణ్ కు ఒక ఆకర్షణీయమైన పొలిటికల్ ప్యాకేజ్ తెలుగుదేశం వర్గాల ద్వారా పవన్ కు ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎపి హెరాల్డ్ కు అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు పవన్ ను ఒప్పించి ఏదోవిధంగా సీమంద్రా తెలంగాణ ప్రాంతాలలో పది పెద్ద బహిరంగ సభలలో పవన్ కాంగెస్ పార్టీనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ను టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆవేశ పూరితమైన ప్రసంగాలు చేసి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశ పార్టీలకు ఓట్లు వేయమని పవన్ ప్రజలను కోరితే దానికి ప్రతిఫలంగా పవన్ పాల్గొనే ప్రతి బహిరంగ సమావేశానికి అయ్యే ఖర్చులను భరించడమే కాకుండా ఒక భారీ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీకి పార్టీ ఫండ్ గా ఇవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని ఏర్పడిన తరువాత అక్కడ పవన్ కళ్యాణ్ కు ఒక పెద్ద స్టూడియో కట్టుకోవడానికి భారీ స్థాయిలో స్థలాన్ని ఇవ్వడమే కాకుండా పవన్ నిర్మించబోయే స్టూడియోకు అన్నివిధాల అనుమతుల దగ్గర నుంచి రకరకాల ప్రోత్సాహాలు అందచేసి అటు కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక సహాయ సహకారాలు పవన్ కళ్యాణ్ కు అందిస్తామని ఆకర్షణీయమైన ప్యాకేజ్ ని పవన్ ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది.  కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం చాల సులువైన పని అయినా ఇప్పటికీ ఒక బలమైన శక్తిగా ఎదిగి ఉన్న జగన్ ను తన మాటలతో టార్గెట్ చేస్తే రాబోతున్న రోజులలో ఎన్నికల తరువాత పరిస్థుతులు ఎలా ఉంటాయి అన్న విషయం పై పవన్ తన సన్నీహితులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రానున్న రోజులలో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: