నందమూరి నారా కుటుంబాల అభిప్రాయభేదాలు మళ్ళీ చంద్రబాబు తనయుడు లోకేష్ సాక్షిగా మీడియా ముందు బయట పడ్డాయి. టీడీపీ తరఫున ప్రచారానికి తాము బాలకృష్ణతో సహా ఎవరినీ ఆహ్వానించడం లేదని నారాలోకేష్ తెలిపారు. ఎవరికివారు పార్టీ మీద ఇష్టంతో ప్రచారంలోకి దిగుతున్నారని ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదే సందర్భంలో జూనియర్ గురించి మాట్లాడుతూ తాము జూనియర్ ఎన్టీయార్‌కు కూడా ఆహ్వానం పంపలేదని బొట్టు పెట్టి పిలవడానికి తమ ఇంటిలో జరుగుతున్న శుభకార్యం కాదని లోకేష్ జూనియర్ పై సెటైర్లు వేయడం సంచలనంగా మారింది. టీడీపిని ఎలాగైనా ఈసారి అధికారంలోకి తీసుకురావాలని గట్టిగా శ్రమిస్తున్న బాబుకి తోడుగా కుటుంబంలోని అందరు పార్టీని తమదిగా భావించినవాళ్లే ప్రచారానికి వస్తున్నారు అంటు బాలక్రిష్ణ కూడా అలాగే వస్తున్నా అని లోకేష్ వ్యాఖ్యలపట్ల రాజకీయ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. అసలు లోకేష్ ఏ హోదాలో ఈ వ్యాఖ్యలు చేశారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీకి జూనియర్ ఎన్టీఆర్, లోకేష్‌లు ఇద్దరూ సమానమే. ఈ ఇద్దరిలో ఎవరూ ఒకరు ఎక్కువా కాదు.. ఒకరు తక్కువా కాదు. అన్నింటికిమించి ప్రత్యేకించి ఇటువంటి మాటలు మాట్లాడటానికి లోకేష్‌ కంటూ పార్టీలో ఎటువంటి హోదా లేదు అంటు జూనియర్ అభిమానులు లోకేష్ పై మండిపడుతున్నారు. ఈ తరం వారిని ప్రభావితం చేయగల సత్తా జూనియర్ కే ఉందని అసలు ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ద్వారా లోకేష్‌కన్నా జూ.ఎన్టీఆరే ఓ అడుగు ముందున్నాడు అంటూ జూనియర్ అభిమానులు లోకేష్ పై సెటైర్లు వేయడం బట్టి వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ తెలుగుదేశానికి రాబోతున్న ఎన్నికలలో కీడు చేస్తుందని తెలుగుదేశ వర్గాలు భయడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: