అల్లుఅర్జున్ తనకు కొడుకు పుట్టిన తరువాత మాట్లాడుతున్న మాటలలో చాల పరిపక్వత కనిపిస్తోంది. వెండి తెర పైనే కాకుండా సినిమా సెట్ల పై కూడ తెగ హడావిడి చేసే బన్నీలో ఇంత భావకుడు ఉన్నాడా అనే విధంగా ప్రస్తుతం బన్నీ మాటలు అనిపిస్తున్నాయి. వైవాహిక బంధానికి అసలైన అర్థం బిడ్డ పుట్టిన తర్వాతే తెలుస్తుందని ఇటీవల తండ్రయిన సందర్భంగా అల్లు అర్జున్ పేర్కొన్నాడు. తల్లిదండ్రులు కాకముందు, ఆలుమగలు ఏదో డేటింగ్ చేస్తున్నట్లుగా ఉంటుందని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇదే సందర్భంగా తన ముద్దుల తనయుడికి ‘అయాన్’ అనే పేరుని ఖరారు చేశానని ప్రకటించాడు బన్నీ. ఈ పేరుకి ఇస్లామ్‌లో ‘దేవుడి బహుమతి’ అని, సంస్కృతంలో ‘పవిత్రం’ అని, పెర్షియన్‌లో ‘గుర్తుంచుకోదగ్గవాడు’ అని, హెబ్రూలో ‘ప్రశాంతం’ అని అర్థం అని అల్లు వారి అబ్బాయి చెపుతున్నాడు. ఇన్ని భాషల అర్ధాలతో పేరు పెట్టుకున్న జూనియర్ బన్నీ భవిష్యత్ లో ఎన్ని భాషలు నేర్చుకుంటాడో మరి. కొడుకు పుట్టిన వేళా విశేషంతో వారం తిరగ కుండానే విడుదల అయిన ‘రేసుగుర్రం’ బన్నీ క్రేజ్ ను రేసుగుర్రం లాగే పరుగులు తీయిస్తోంది. భవిష్యత్ లో ఈ అయాన్ మరింకెన్ని పరుగులు తీస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: