అల్లుఅర్జున్ ‘రేసుగుర్రం’ సినిమా మ్యానియా రాష్ట్రంలో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా భాగ్యనగరంలో జరిగిన ఒక లేటెస్ట్ సంఘటనను పేర్కొనవచ్చు. ఈ సినిమా టికెట్ల వ్యవహారంలో కొoదరు కాలేజి విద్యార్దులు రెండు వర్గాలుగా విడిపోయి ఉద్రిక్తతలకు ఒక సంఘటన తావు ఇచ్చింది.  అంతేకాదు ఈ చిన్న వ్యవహారం పై ‘రేసుగుర్రం’ టిక్కెట్ల కోసం ఒక వర్గంలోని యువత మరో వర్గం యువతపై దాడి చేయడంలో పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసాయని వార్తలు వస్తున్నాయి. సైఫాబాద్ పీజీ కళాశాల విద్యార్థులు ఖైరతాబాద్‌లోని ఒక థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ‘రేసుగుర్రం’ చిత్రానికి వెళ్లిన సందర్బంగా ఈ సంఘటన చోటు చేసుకుంది  టిక్కెట్ల విషయంలో వీరికి, స్థానిక యువతకు మధ్య వివాదం జరిగింది. ఇది కొట్లాటకు దారి తీసింది అని తెలుస్తోంది. సినిమా టికెట్ల విషయంలో దెబ్బలు తిన్న విద్యార్థులు కళాశాలకు వెళ్లి మరికొంతమందితో థియేటర్ వద్దకు వచ్చారట. ఇది గమనించిన సైఫాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అని టాక్. వారందర్నీ స్టేషన్‌కు తరలించడంతో అక్కడ స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకు పోతున్న బన్నీ రేసుగుర్రం నిన్నటితో ముగిసిన మొదటి మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లు కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాల టాక్. ఏమైనా బన్నీకి మళ్ళీ మంచి రోజులు వస్తునట్లే అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: