రాజమౌళి ‘ఈగ’ తో కన్నడ హీరో సుధీప్ టాలీవుడ్ అందమైన విలన్ గా మారిపోయాడు. ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పత్రికకు సుదీప్ ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. దీనికి కారణం ఈ ఇంటర్వ్యూలో సుధీప్ జూనియర్ ఎన్టీఆర్ పై వింత వ్యాఖ్యలు చేసాడు.  జూనియర్ టాలీవుడ్ లో పెద్ద హీరోగా మారిపోయినా తనకు మాత్రం జూనియర్ ఎప్పుడు చిన్న పిల్లవాడు లానే కనిపిస్తాడు. అంతేకాదు గలగలా మాట్ల్దాడే అతని మాటలు వింటే చిన్న పిల్లలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని అంటు అందర్నీ ఆశ్చర్య పరిచే కామెంట్స్ చేసాడు సుధీప్. ఇదే ఇంటర్వ్యూలో జూనియర్ వ్యక్తిగత జీవితంలోని విషయాలు గురించి చెపుతూ జూనియర్ చిన్న తనంలో ఎదుర్కున్న వ్యతిరేక పరిస్థుతులు మరే హీరోకు లేవనీ ఆ వ్యతిరేక పరిస్థితుల మధ్య స్వయం కృషితో ఎదిగిన జూనియర్ అంటే తనకు ఎంతో అభిమానమనీ చెప్పాడు ఈ ఈగ విలన్. జూనియర్ ను చూసి తాను తల్లిని ఎలా ప్రేమించాలో ఎలా గౌరవించాలో పాఠాలు నేర్చుకున్నానని చెపుతున్న సుదీప్ టాలీవుడ్ లో తనకు జూనియర్ తో పాటుగా రవితేజా, నాని, తరుణ్ లు అంటే విపరీతమైన ఇష్టం అని అంటున్నాడు. మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మను సుధీప్ ప్ విపరీతంగా పొగడటంతో వర్మ రాబోయే సినిమాలలో మన ఈగ విలన్ నటిస్తున్నాడా అనే అనుమానం కలుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: