సమంత కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీను షేక్ చేస్తుంది. ప్రస్తుతం సమంత ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో వరుస మూవీలను చేస్తుంది. క్షణం తీరిక లేని షూటింగ్ సమయాన్ని గడుపుతుంది. ఇదిలా ఉంటే సమంత మరో కోలీవుడ్ హీరో సరసన ఆపర్ కొట్టేసింది. దీనికి సంబంధించిన అఫిషియల్ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. కోలీవుడ్ హీరో విక్రమ్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తుంది. దీనికి సంబంధించిన అఫిషియల్ న్యూస్ ను కోలీవుడ్ మీడియా బయట పెట్టేసింది. విక్రమ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఐ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం ఏ.ఆర్.మురుగుదాస్ నిర్మాణంలో రాబోతున్న మూవీలో నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు హీరోయిన్ గా సమంతను ఓకె చేశారు. ప్రస్తుతం సమంత, కోలీవుడ్ హీరో సూర్య సరసన అంజాన్ మూవీలో నటిస్తుంది. సమంత వరుసగా కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో సైన్ చేసుకుంటూ వెళుతుంది. దీంతో హన్సిక లాంటి హీరోయిన్స్ కు కష్టకాలంగా ఉందంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సమంత టాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో నెంబర్ వన్ హీరోయిన్ ఖాయం అని అంటున్నారు. సమంత ఇంతలా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించటానికి కారణం ఏంటని అందరూ తెగ ఆలోచించుకుంటున్నారు. సమంత కోలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదగటం ఖాయం అంటారా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: