టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకున్న అనుష్క, ఇప్పుడు తన నెక్ట్స్ టార్గెట్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పడింది. అయితే అనుష్క కంటే ముందుగానే సమంత కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టడంతో, సమంత ఆఫర్ల విషయంలో కొద్దిగా ముందే ఉంది. అనుష్క ప్రస్తుతం కోలీవుడ్ లో అజిత్ సరసన నటిస్తుంది. ఈ మూవీలో నటించడమే కాకుండా అజిత్ ను ఆశ్ఛర్యపరుస్తుందట. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా వస్తున్న మూవీలో అనుష్క హీరోయిన్. అయితే ఈ మూవీలో అనుష్క అందరినీ ఆశ్ఛర్యపరిచే నిర్ణయం తీసుకుంది. తన క్యారెక్టర్ కు తనే డబ్బింగ్ చెపుకుంటానని హీరోకు, దర్శకుడికి చెప్పింది. అయితే మొదటగా గౌతమ్ మీనన్, అజిత్ వద్దని అన్నారంట. అయితే తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలనని అజిత్ ను ఒప్పించిందట. దీంతో అనుష్క కాన్ఫిడెంట్ ను చూసిన అజిత్ ఆశ్ఛర్యపోయాడంట. మొత్తానికి గౌతమ్ మీనన్ మూవీలో అనుష్క సొంత డబ్బింగ్ చెప్పుకోవటానికి సిద్ధపడింది. కోలీవుడ్ లో అజిత్ మూవీ తరువాత, రజనీకాంత్ మూవీలో నటించేందుకు సిద్ధంగా ఉంది. రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ రానా లో అనుష్క నటిస్తుందంటూ కోలీవుడ్ లో ఇప్పటికే క్లారిటీ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీకు కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: