సాధారణంగా ఓ సౌత్ హీరోయిన్ నార్త్ కి వెళితే అదో పెద్ద న్యూస్. ఆసిన్ నుంచి తాప్సీ వరకూ ఇక్కడ సక్సెస్ సాధించి ముంబై ఫ్లైట్ ఎక్కిన వారు ఎందరో. అయితే, ఈ మధ్యే తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చిన ఓ హాట్ బ్యూటి రెండో సినిమాకే బాలీవుడ్ చెక్కేసింది. అంతే కాదు, తన న్యాచురల్ గ్లామర్ ని మరింత న్యాచురల్ గా ప్రదర్శించేస్తూ.... సెన్సేషన్ సృష్టిస్తోంది! తనే క్రుతిసనన్. మొదటి సినిమాలోనే ప్రిన్స్ సరసన ఛాన్స్ కొట్టేసిన కృతీ మాంచి లక్కీ లేడీ అనే చెప్పాలి.  ఎందుకంటే, రెండో సినిమా టాలీవుడ్లో వెంటనే లభించనప్పటికీ బాలీవుడ్ రారామ్మని పిలుచుకుపోయింది. ఎందుకంటే, కృతీలో చాలా వరకూ బి-టౌన్ బ్యూటీస్ కి కావాల్సిన లక్షణాలే కనిపిస్తాయి కాబట్టి! ఇప్పటికే బాలీవుడ్లో తొలి సినిమా చేసేసిన కృతీ సనోన్... దాని రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. రాబోయే కొన్ని వారాల్లో మన ముందుకు రానున్న ఈ సినిమా ఓ కొత్త హీరోని కూడా బాలీవుడ్ కి పరిచయం చేస్తోంది. హీరోపంతి అనే టైటిల్ తో వస్తోన్న స్టైలిష్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో టైగర్ ష్రాఫ్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇతను ప్రముఖ బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ కొడుకు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ నిర్మాత క్రుతిసనన్ ను తన బ్యానర్ లో వరుస మూవీలు చేయాలని బెదిస్తున్నాడంట. అంతుకు అగ్రిమెంట్స్ మీద సైన్ చేయాలని పదే పదే విసిగిస్తున్నాడని క్రుతిసనన్ అందరికి చెప్పుకొని వాపోతుంది. అయితే బడ ప్రొడ్యూజర్ బ్యానర్ లో నటిస్తే, హీరోయిన్స్ కు చుక్కులు కనిపిస్తాయని బాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: