నందమూరి నటసింహం నటించిన లెజెండ్ మూవీ అన్నీ సెంటర్స్ లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ప్రస్తుతం రేసుగుర్రం మూవీ సక్సెస్ ఫుల్ టాక్ సంపాదించుకున్నప్పటికీ లెజెండ్ మూవీ కలెక్షన్స్ ఇంకా నిలకడగానే కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే చాలు, లెజెండ్ మూవీ ఏ విధంగా బాక్సాపీస్ వద్ద దూసుకుపోతుందో తెలుస్తుంది. అయితే త్వరలోనే లెజెండ్ మూవీను ఎలక్షన్స్ వరకూ నిలిపేయవచ్చు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ డిటైల్స్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అనంతపురం జిల్లాలో వై.యస్.ఆర్.సి.పి లీడర్స్ లెజెండ్ మూవీను ఎలక్షన్స్ వరకూ రాష్ట్రం అంతటా నిలిపివేయాలని, ఆ జిల్లా కలెక్టర్ ను పిర్యాదును ఇచ్చారు. అలాగే ఎలక్షన్ కమీషనర్ ను కలిసి కూడ పిర్యాదు కూడ ఇచ్చారు. మూవీలో కొన్ని డైలాగులు తెలుగుదేశం పార్టీకు సపోర్ట్ గానూ, ఇతర పార్టీలకు వ్యతిరేకంగానూ ఉన్నాయి అంటూ వారు పిర్యాదు చేశారు. దీనిపై ఎలక్షన్ కమీషనర్ మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. బాలక్రిష్ణ యువతను ప్రభావితం చేసే విధంగా లెజెండ్ మూవీ ఉందని జగన్ తరుపు నాయుకుల నుండి ప్రధానంగా వినిపిస్తున్న అభియోగం. అయితే ఇదంతా జగన్ వర్గం కావాలని చేస్తున్న స్టంట్ అని బాలయ్య అభిమానులు అంటున్నారు. మొత్తానికి లెజెండ్ పుణ్యమా అంటూ బాలక్రిష్ణ ఎన్నికల సమయాన ఏదైతే జరగాలని కోరుకున్నాడో, ఇప్పుడే అదే జరుగుతుందని టాలీవుడ్ అంటుంది. ఈ ఎలక్షన్స్ లో బాలక్రిష్ణ హిందుపురం నుండి పోటీ చేస్తున్నాడు. లెజెండ్ మూవీ సక్సెస్ ఎంజాయ్ మెంట్ లో ఉన్న బాలక్రిష్ణ, రాజకీయాల్లోనూ అదే సక్సెస్ ను కొనసాగిస్తాడో? లేదో చూడాలి మరి. బాలక్రిష్ణ లెజండ్ మూవీను ఆపే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: