అల్లు అర్జున్ "రేసు గుర్రం" పోజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా 1050 థియోటర్స్ లలో విడుదల అయి మంచి కలక్షన్స్ కురిపిస్తున్న అల్లుఅర్జున్ మాత్రం నిరాసగానే ఉంటున్నాడు అనే మాటలు వినపడుతున్నాయి. ఈ సినిమాకు బన్నీ కెరియర్ లోని ఎప్పుడూ రాని ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ క్రెడిట్ బన్నీ కన్నా బ్రహ్మానందం కొట్టేస్తున్నాడు. కిల్ బిల్ పాండేగా చేసిన బ్రహ్మానందం ఎపిసోడ్ సినిమా చివరి ఇరవై నిముషాలు లేకపోతే ‘రేసుగుర్రం’ సినిమాకు ఈ రిజల్ట్ వచ్చేదికాదేమోనని రేసుగుర్రాన్ని పూర్తి నిలబెట్టింది బ్రాహ్మి అనే టాక్. సినిమా విమర్శకుల నుండి సినిమా ప్రేక్షకుల వరకు ఇలా ఒకే టాక్ వినిపించడంతో అల్లుఅర్జున్ కు షాకింగ్ న్యూస్ లా మారింది అని అంటున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా పూర్తిగా బ్రహ్మి నిలబెట్టిన చిత్రం అని అంతటా ప్రచారం జరుగుతోంది. అయితే మొదటిగా బ్రహ్మానందo కిల్ బిల్ ఇంత పెద్దదిగా ఉంటుందని అల్లుఅర్జున్ అనుకోలేదట కాని పాత్ర బాగా కుదరడంతో దర్శకుడు సురేంద్ర రెడ్డి బ్రాహ్మి పాత్రను పెంచడం ఇప్పుడు అల్లుఅర్జున్ పాత్రలోని క్రేజ్ ను మింగేసే స్థాయికి బ్రాహ్మి పాత్ర ఎదిగిపోవడం అనుకోని విషయమే అయినా ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఆనందించే స్థాయిలో బన్నీని నిలపకుండా బ్రహ్మనందం కలవర పెడుతున్నాడు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: