ఈరోజు ఉదయం నుంచి కర్ణాటకలో ప్రారంభం అయిన పవన్ ప్రచార సభలు ఇంకా పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ పై పవన్ అభిమానులం అంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా తమ అభిమాన హీరో భారతీయ జనతా పార్టీ తరపున కర్ణాటకలో పవన్ జరుపుతున్న ప్రచార సభలు తమకు అస్సలు నచ్చడం లేదని సందేశాలు పెడుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం కర్ణాటకా రాష్ట్రంలో పవన్ ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్ధుల పై చాల అవినీతి ఆరోపణలు ఉన్నాయనీ అటువంటి వ్యక్తులకు పవన్ లాంటి వ్యక్తి ప్రచారం చేస్తే సమాజంలో పవన్ కోరుకునే నీతి నిజాయితీలు ఎంత వరకు నిలబడతాయని అదేవిధంగా తాము పవన్ అభిమానులమని ఎలా తల ఎత్తుకు తిరగాలనీ అంటు పవన్ అభిమానుల పేరిట సోషల్ మీడియాలో వస్తున్న మెసేజ్ లు టాపిక్ ఆఫ్ ది డే గా మారుతున్నాయి. నిన్న తనను కలిసిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పవన్ తాను ప్రచారం చేసే సభలలో కులం, మతం, ప్రాంతం వంటి పదాలు నాయకుల నోటివెంట రాకూడదని కండిషన్ పెట్టినా అది ఆచరణలో అసాధ్యం అన్న సంగతి పవన్ కు తెలియదా అని కూడ అభిమానులు మండి పడుతున్నారు. ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీలో పవన్ కల్యాణ్ చిచ్చుపెట్టాడంటు జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. హుజూర్‌నగర్ టీడీపీ అభ్యర్థివంగాల స్వామి గౌడ్ పేరిట ముద్రించిన తెలుగుదేశం పార్టీ డోర్ పోస్టర్లలో సినీనటుడు పవన్ కల్యాణ్ ఫొటో వుండడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్ ఫోటోలు పెట్టకుండా పవన్ ఫోటో మాత్రమే ఎలా పెడతారంటూ స్వామిగౌడ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు జూనియర్ అభిమానులు. అంతేకాదు పోస్టర్లను తగులబెట్టారు స్వామిగౌడ్‌తో వాగ్వాదానికి దిగారు అని తెలుస్తోంది.. పరిస్థితి ముదరడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు అనే వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి రోజు ప్రచారమే సంచలనంగా మారింది అని అనుకోవాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: