మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘నాయక్’ సినిమాకు మంచి మాస్ ట్యూన్స్ అందించి ఆ సినిమా ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించిన సంగీత దర్శకుడు తమన్ ను ఏరికోరి చెర్రీ - కృష్ణవంశీల కాంబినేషన్లో తీస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే' కోసం సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ కూడ పూర్తి అయింది. త్వరలోనే రెండవ షెడ్యూల్ కు ఈ సినిమా రెడీ అవుతోంది.  ఇటువంటి టైంలో సంగీత దర్శకుడు తమన్ ను ఈ సినిమా నుండి తప్పించడం షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ సినిమాకు తమన్ స్థానంలో ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజాను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్పుకు గల కారణం తమన్ వ్యవహార శైలి అని అంటున్నారు.  గత రెండు నెలలుగా ఈ సినిమా కోసం తమన్ వినిపిస్తున్న పాటల ట్యూన్స్ అటు చరణ్ కు కాని ఇటు దర్శకుడు కృష్ణ వంశీకి కాని ఏమీ నచ్చడం లేదట. పల్లెటూరి వాతావరణం నేపధ్యంలో నిర్మింపబడుతున్న ఈ సినిమా పాటలకు వెరైటీ ట్యూన్స్ ఇమ్మని కృష్ణవంశీ కోరినా అవి ఏవి పట్టించుకోకుండా తన మాస్ బీట్ తరహాలో పాటలను కంపోజ్ చేస్తూ ఉండటంతో విసిగి పోయిన కృష్ణవంశీ చరణ్ అంగీకారంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే తమన్ అందిస్తున్న పాటలు తన గత సినిమాలలోని ట్యూన్స్ ను పోలి ఉంటున్నాయని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఇంత భారీ సినిమా నుండి తప్పించడం తమన్ కు షాకింగ్ న్యూసే అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: