సీమాంధ్రలో ఎన్నికల ప్రచారానికి రధసారధిగా ముందుకు వెళుతున్న చిరంజీవి మాటలు జోక్స్ గా పేలుతున్నాయి. ఒక కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అనే మాటలేనా అని అనిపించే స్థాయిలో ఆశ్చర్యాన్ని కలగ చేస్తున్నాయి. తన సినిమా కెరియర్ పరిజ్ఞానాన్ని ఎన్నికలతో ముడిపెట్టి చిరూ చేస్తున్న ప్రసంగాలు కాంగ్రెస్ వారికే షాక్ ఇచ్చేలా చేస్తున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితిని ఫ్లాప్ సినిమాతో పోలుస్తూ చిరంజీవి సంచలనం చేసారు. ‘స్టోరీ బాగుంటుంది అందులో అందరి నటనలు కూడా అద్భుతంగా వుంటాయి. కానీ ప్రేక్షకుల్ని అలరించి, ఆకట్టుకోలేనప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. సరిగ్గా ఆడదు. సినిమా బాగున్నా ఓటమికి దారితీసిన పరిస్థితులు వేరు అంత మాత్రాన నిరాశపడిపోం. సినిమాలు చేయడం మానేయం మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వెళ్తాం. అలరించి ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తాం ఇప్పుడు సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే’ అంటూ వ్యాఖ్యానo చేసిన మాటలు టాపిక్ ఆఫ్ ది డేగా మారాయి.  చిరంజీవి అంటున్న మాటలు కాంగ్రెస్ కు బలాన్ని ఇస్తాయా లేకుంటే సూపర్ ఫ్లాప్ షోకి కాంగ్రెస్ రెడీ అయింది అంటు చిరంజీవి ముందుగానే సంకేతాలు ఇస్తున్నాడా అంటు సెటైర్లు పడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: