ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా సినిమా రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించిన హీరోలలో నాని ముందు వరుసలో ఉంటాడు. `అష్టా చ‌మ్మా`, `అలా మొద‌లైంది` చిత్రాల‌తో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని రాజ‌మౌళితో `ఈగ` తో టాప్ హీరో అయిపోతాడు అనుకున్నారు అంతా. అయితే అప్పటి నుంచి అంచనాలు తలక్రిందులై వరస పరాజయాలు పొందుతున్నాడు. అటువంటి ‘ఈగ’ హీరో ఇటీవ‌ల జ‌రిగిన ఒక ఆడియో వేడుక‌లో `నా బాధ‌లు మీకేం తెలుసు` అన్నాడు. నిజంగా నాని లాంటి హీరోకి కూడా బాధ‌లుంటాయా? అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ మధ్యన ప్రేక్షకుల ముందుకొచ్చిన రెండు సినిమాలూ బోల్తా కొట్టాయి త్వర‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న మ‌రో చిత్రం `జెండాపై క‌పిరాజు`పై కూడా ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇలా వ‌రుస వైఫ‌ల్యాల‌వ‌ల్లే నాని బాధ‌ప‌డుతుండొచ్చు అని జ‌నాలంతా అనుకొన్నారు. అయితే నాని బాధ పడింది అదికాదట వేరే విషయం. నానీకి ఈ వేడుకలో కూర్చున్నప్పట్నుంచి అంద‌రూ నాని వంక చూసి అలా ఉన్నాడు న‌వ్వడం లేదు అని అంటు కామెంట్స్ చేసుకున్నారట. అయితే అసలు కారణం నానీకి వేదిక పైకి రాగానే ఎండ హెచ్చుగా ఉండటంతో చల్లటి నీళ్ళ బాటిల్ పూర్తిగా తాగేయడంతో బాత్రుమ్ సమస్య వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాక సీరియస్ గా కూర్చుంటే సినిమాలు వరుస పెట్టి ఫ్లాప్ అవ్వడంతో నాని దిగులుగా ఉన్నాడు అంటు సెటైర్లు పడటం నానీకి ఆశ్చర్యం కలిగించిందట. ఎదో ఒక కారణంతో నవ్వకపోతే అది సినిమాల పై బెంగ అనుకుంటూ ఊహించుకుని వార్తలు రాస్తే ఎలా? అంటున్నాడు ఈగ నాని.  

మరింత సమాచారం తెలుసుకోండి: