కనీసం జానెడంత కూడ ఉండని ఉడత రెండు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చి పెట్టింది అంటే ఎవరు నమ్మరు కానీ ఇది నిజం. అమెరికాలో నిర్మాణంలో ఉన్న ఒక ప్రభుత్వ భవంతిలో విలువైన సామగ్రిని ద్వంసం చేసి ఈ ఉడత అమెరికా అధికారులకే చుక్కలు చూపెట్టింది. అమెరికాలోని ఇండియానాలో మెక్ మిలిన్ పార్కులో కమ్యూనిటీ సెంటర్ నిర్మించేందుకు అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది.  దీనికోసం ఆ భవనంలో విలువైన విద్యుత్ సామగ్రి ఇతర వస్తువులను నిలువ ఉంచారు. అయితే ప్రతిరోజు రాత్రి ఎవరో ఈ భవనంలో ప్రవేసించి అక్కడ ఉన్న సామానులను పాడుచేయడం అక్కడి అధికారులకు ప్రశ్నగా మారింది. ఎంతో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండే ఆ భవనంలోకి ఆగంతకులు ఎలా ప్రవేసిస్తున్నారో అక్కడ అధికారులకు కూడ అర్ధం కాలేదు. అయితే తీవ్రమైన పరిశోధనతో ఈ విషయం పై మనసు పెట్టిన అధికారులకు ఒక నమ్మలేని నిజం బయటకు వచ్చింది. ఇంత వ్యవహారాన్ని నడిపింది ఒక చిన్న ఉడత. ఈ ఉడత చేసిన ఘనకార్యం వల్ల దాదాపు 1. 80 కోట్లు విలువైన సామగ్రి ద్వంసం అయిందని లెక్కలు తేల్చారు. అయితే అమెరికా అధికారులు ఈ ఉడతను పట్టుకుందామని ఎంత ప్రయత్నించినా వారికి కనిపించి వారి చేతికి దొరక్కుండా పారిపోయింది ఈ ఉడత. శ్రీరామచంద్రుడికి సముద్రం పై వంతెన నిర్మించడానికి తన వంతు సహాయపడిన ఉడత అమెరికా వారికి మాత్రం కోట్ల నష్టాన్ని కలుగ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: