పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు దేవుడుతో సమానం అని అంటారు కొందరు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ను కొత్త మూవీల ఆడియో ఫంక్షన్స్ కు ఇన్వైట్ చేయటానికి చాలా మంది చాలా రకాలుగా తంటాలు పడుతుంటారు. కాని ఓ రైటర్ మాత్రం పవన్ కళ్యాణ్ కు బిస్కెట్ వేసి తన పని ఈజీగా చేయించుకున్నాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. శ్రీనువైట్ల టీం నుండి గొడవ పడి బయటకు వచ్చిన రైటర్ కోనవెంకట్ అంటూ తనపై ముద్రపడింది. అయితే కోనవెంకట్ వద్ద టాలెంట్ ఉన్నప్పటికీ తనను నమ్మి మూవీను ఇవ్వటానికి ఏ హీరో సాహసించటంలేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కోనవెంకట్ కు తను హీరోగా ఓ మూవీకు ఛాన్స్ ఇచ్ఛాడు. అనుకోని రీతిలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రి ఇవ్వటంతో ఆ ప్రాజెక్ట్ వెనకపడింది. అయితే చాలా మంది హీరోలు కోన చెప్పిన స్టోరీకు యస్ అన్నట్టే అని, తరువాత గ్యాప్ పెంచుకుంటూ వస్తున్నారు. దీంతో విసుకుచెందిన కోనవెంకట్ తనే సొంతంగా ఓ మూవీకు ప్రొడ్యూజర్ గా మారాడు. దానికి సంబంధించిన పోస్టర్ లుక్ రీలీజ్ ను పవన్ కళ్యాణ్ చేతుల మీదగా రిలీజ్ చేయించాడు. అలాగే ఆ మూవీ ఆడియో ఫంక్షన్ కు సైతం పవన్ కళ్యాణ్ రావాలని , అందుకు పవన్ వద్ద మాట తీసుకున్నాడని టాక్ వినిపిస్తుంది. మొత్తంగా కోనవెంకట్ నిర్మిస్తున్న గీతాంజలి మూవీకు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ వాడాలని, అందుకే కోనవెంకట్ పవన్ కి బిస్కెట్స్ వేస్తున్నాడని టాలీవుడ్ టాక్స్. కోనవెంకట్ మూవీకు దర్శకత్వం వహించకుండా, ప్రొడ్యూజర్ గా మారటానికి కారణాలు ఏమిటి? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: