మెగా ఫ్యామిలి వారసుడిగా, స్టైలిష్ స్టార్ తమ్ముడిగా శిరీష్ ఆచితూచి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, తొలి సినిమా గౌరవం కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. దాంతో బాక్సాఫీస్ రిజల్ట్ కూడా తేడాకొట్టేసింది. మొదటి సినిమాలో చేసిన రిస్క్ రెండో సినిమాలో ఎంత మాత్రం చేయలేదు శిరీష్. యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో కొత్త జంట ఓకే చేశాడు. మరి కొద్ది రోజుల్లో ఆడియన్స్ రెస్పాన్స్ కోసం థియేటర్స్ కి రానున్నారు. ఈ మూవీకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అయితే, సినిమాలో ఈ ఇద్దరూ ఓ టెలివిజన్ రియాల్టీ షో యాంకర్స్ గా కనిపిస్తారట! ఆ రియాల్టీ షో పేరే కొత్త జంట. దాన్నే సినిమాకి కూడా పెట్టారు. కొత్త జంట సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరూ తమ కెరీర్స్ కోసం ఎలా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తారు. టుడేస్ యూత్ ఎంత మెటీరియలిస్టిక్ గా మారిపోయింది... ఇలాంటి కాన్పెస్ట్స్ డిస్కస్ చేశాడట మారుతి! హీరో, హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్, అలాగే సినిమా కథ గురించి బయటకొచ్చేయటంతో ఈ మూవీ స్టోరిను కాపీ కథగా కొందరు పరిగణిస్తున్నారు. అయితే మారుతి టేకింగ్ చాలా డిప్రెంట్ కాబట్టి, కోత్తజంట ఏ విధంగా ఉండబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: