తెలుగు సినిమా ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇష్ట పడతారు. ఆ తర్వాత యాక్షన్‌ సినిమాలపై ఆసక్తి కనబర్చాతారు. మొత్తంగా తెలుగు ప్రేక్షకులకు ఒక చిత్రం నచ్చాలి అంటే ఆ చిత్రంలో కామెడీ, మంచి మాస్‌ పాటలు, ఓ మూడు నాలుగు ఫైట్స్‌ ఉండాలి. ఇందులో ఏం తక్కువ అయినా కూడా ఆ చిత్రంను తెలుగు వారు ఆధరించడం కష్టమే. ఇక ప్రయోగాలను తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం ప్రోత్సహించరు. ఒక వేళ ప్రయోగాత్మక చిత్రాలు వచ్చినా అవి విడుదలకే కష్టపడతాయి. థియేటర్స్‌కు వచ్చినా కూడా వాటిని చూసేందుకు మెజారిటీ ప్రేక్షకులు ఆసక్తి చూపించరు. తెలుగు ప్రేక్షకులకు పూర్తి భిన్నం తమిళ ప్రేక్షకులు. వారు ప్రయోగాత్మక చిత్రాలను బాగా ఆదరిస్తారు. తమిళ చిత్రాల్లో హీరో, హీరోయిన్‌ ఎలా ఉన్నా కూడా అక్కడి వారు కథ, కథనం బట్టి సినిమాలను చూస్తారు. ఇక తమిళ చిత్రంలో స్యాడ్‌ ఎడిరగ్‌తో సినిమా ముగిసినా సినిమాను సక్సెస్‌ చేస్తారు. కాని తెలుగు ప్రేక్షకులు అలా కాదు, ఒక చిత్రం క్లైమాక్స్‌లో అంత హ్యాపీగా ఉండాలి. హీరో, హీరోయిన్‌ కలవాలి. ఇక తెలుగు సినిమాల్లో హీరో అంటే ఒకే సారి వంద మందిని కొట్టేస్తాడు. ఇలా తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. అటువంటిది తాజాగా అక్కడ ‘నాన్‌ సిగప్పు మనితన్‌’ చిత్రం విడుదలైంది. అదే చిత్రం తెలుగులో ‘ఇంద్రుడు’గా రాబోతుంది. హీరో ఒక వింత జబ్బుతో బాధపడుతుంటాడు. అయితే అతని ముందే హీరోయిన్‌పై గ్యాంగ్‌ రేప్‌ జరుగుతుంది. ఇలాంటి సీన్స్‌ తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే అంటున్నారు తెలుగు సినీ విశ్లేషకులు. హీరోయిన్‌ గ్యాంగ్‌ రేప్‌ అవుతుంటే హీరో ఎక్కడ ఉన్నా కూడా హుటాహుటిన వచ్చి ఆమెను కాపాడాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటారు. మరి ‘ఇంద్రుడు’ అలా చేయలేదు. మరి ఇంకా ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మరి ఈ చిత్రంను తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి. ఈ చిత్రంలో విశాల్‌ సరసన లక్ష్మీ మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇందులో వీరిద్దరి మధ్య ఒక గాఢ లిప్‌లాక్‌ సన్నివేశం ఉంది. మరి చిత్రంకు ఆ లిప్‌లాక్‌ ఏమైనా హెల్ప్‌ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: