అనుష్క తన సినిమాలకి తాను డబ్బింగ్ చెప్పుకోదు. అరుంధతి లాంటి పవర్ ఫుల్ పాత్రలో కనిపించినప్పటికీ ఈ సూపర్ బ్యూటీ ఏనాడూ తన ఓన్ వాయిస్ ఆడియన్స్ కి వినిపించలేదు. అద్దె గొంతుల మీదే ఆధారపడుతూ వచ్చింది! ఇన్ ఫ్యాక్ట్ అనూనే కాదు మన సినిమాల్లో కనిపించే చాలా మంది హీరోయిన్స్.... ఆల్ మోస్ట్ ఆల్ ది టీ-టౌన్ బ్యూటీస్... ఎవ్వరూ స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోరు. అయితే అనుష్క ఇప్పుడు సొంత డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా చెబుతుంది. తెలుగులో అనుష్క స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోకపోవటం పెద్ద ఆశ్చర్యకరం ఏం కాదు. ఎందుకంటే, ఈ స్వీటీ స్వీట్ మదర్ టంగ్... కన్నడ. అందుకే, తన స్వంత భాష కాని తెలుగులో ఓన్ డబ్బింగ్ అంటూ ఇప్పటి వరకూ ఎప్పుడూ రిస్క్ తీసుకోలేదు. అయితే, కోలీవుడ్లోనూ వరుసగా సినిమాలు చేస్తున్న అనుష్క చెన్నైలో కూడా డబ్బింగ్ స్టూడియోస్ కి దూరంగా వుండిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఇంత వరకూ ఏనాడూ డబ్బింగ్ జోలికి వెళ్లని అనుష్క ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీర్చుకోబోతంది. అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తోన్న ఓ క్రేజీ మూవీకి స్వంతంగా వాయిస్ ఇచ్చేందుకు రెడీ అయిందట! గౌతమ్ కూడా ఓకే అనేశాడు! అయితే, అనుష్క స్వంతంగా తమిళం పలకటంలోని విశేషం ఏంటంటే... త్రిష, సమంత, శృతి.... ఇలాంటి తమిళ పొన్నులు ఇప్పటిదాకా డబ్బింగ్ రిస్క్ చేయలేదు. బట్ కన్నడ కన్య అయిన అనుష్క పక్క రాష్ట్రం వారి భాషలో డబ్బింగ్ కి సై అంది! ఇదీ స్పెషల్!

మరింత సమాచారం తెలుసుకోండి: