మహేష్ బాబు రామ్ చరణ్ సినిమాల మధ్య పోటీ ఇప్పటికే టాలీవుడ్ లో రెండు సార్లు జరిగింది. గత సంవత్సరం మహేష్ ‘సీతమ్మ’ సినిమాతో చరణ్ ‘నాయక్’ ను ఢి కొట్టి నిలబడ్డాడు. కానీ ఈ సంవత్సరం చరణ్ ‘ఎవడు’ సినిమాతో తన ‘వన్’ ను పోటీగా నిలిపితీవ్ర పరాజయాన్ని రుచి చూసాడు. సంక్రాంతి రేసులో విజేతగా నిలిచిన ‘ఎవడు’ కలక్షన్స్ విషయంలో కూడ చరణ్ కు మంచి రికార్డునే తెచ్చి పెట్టింది.  అయితే మొదట్లో వచ్చిన వేగాన్ని ‘ఎవడు’ తరువాత నిలుపుకోలేకపోవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయింది. ఫైల్యూర్ టాక్ తెచ్చుకున్న ‘వన్’ సినిమా తూర్పు గోదావరి జిల్లా తాటి పాకలో వంద రోజులు ఆడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తే హిట్ టాక్ తెచ్చుకున్న చరణ్ ఎవడు కూడ కేవలం మూడేమూడు సెంటర్లలో వంద రోజుల పండుగను చేసుకోవడం మరో ఫ్లాష్ న్యూస్.  మరొక ఆశక్తికరమైన విషయం ఏమిటంటే చరణ్ ‘ఎవడు’ కూడ అతి చిన్న సెంటర్లు అయినగుడివాడ, ఆదోని, ఎమ్మిగనూరు సెంటర్లలో వంద రోజుల రన్ ను పూర్తి చేసుకుంది. దీనిని బట్టి చూస్తూ ఉంటే వందరోజుల రికార్డు కోసం అటు మహేష్ ఇటు చరణ్ సినిమాలు ప్రదర్శించారు కాని ఈ రెండు సినిమాలకు వంద రోజుల సీన్ లేదని అందరికీ తెలిసేటట్లుగా ఈ సినిమా నిర్మాతలు ఎందుకు ఇలా ప్రవర్తించారు అన్న విషయం ఈ హీరోల అభిమానులకే అర్ధం కావడంలేదట.  

మరింత సమాచారం తెలుసుకోండి: