బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్స్ లో ప్రియాంక చోప్ర ఒకరు. ప్రియాంక చోప్ర రెమ్యునరేషన్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. నటిగా భిన్న కోణాలను చూపించగల సత్తా ప్రియాంకా చోప్రాకి ఉంది. అందుకు చాలా వాటినే బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చూపించవచ్చు. ‘ఫ్యాషన్'లో గ్లామరస్‌గా, ‘బర్ఫీ'లో డీ-గ్లామరైజ్డ్‌గా ఒదిగిపోయిన ప్రియాంక నటనను ఎవ్వరూ మరచిపోలేనిది. అయితే ప్రస్తుతం ‘మేరీ కామ్’ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ బాక్సర్ మేరీ కామ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేరీ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఆహార్యంపరంగా చాలా కసరత్తులే చేసింది ప్రియాంక. అలాగే, బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ చిత్రం కోసం రీసెంట్ గా మనాలీలోని ఓ గ్రామంలోను, అటవీ ప్రాంతంలోను కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంగా, ప్రియాంక చోప్ర వద్దకు మరో మూవీ డీల్ వచ్చింది. ఆ కథ ఈసారి మరో క్రీడాకారిణిది కావటం విశేషం. అయితే ప్రియంచ చోప్ర ఆ మూవీ చేస్తే బాగుంటుందని నిర్మాతలు ఆమెను అప్రోచ్ అయ్యారు. అందుకు ప్రియాంక ఓకె చెప్పినప్పటికీ, రెమ్యునరేషన్ వద్ద ఆ డీల్ కాన్సిల్ అయింది. ఆ మూవీను చేయటానికి ప్రియాంక చోప్ర వారిని దాదాపు 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగింది. అంతే కాకుండా మేరి కామ్ మూవీకు ఇంతే రెమ్యునరేషన్ తీసుకున్నాను అని ఓపెన్ గా చెప్పేసిందట. దీంతో ఆ నిర్మాతలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇపుడు ఆ ప్రాజెక్ట్ లో కరీనాకపూర్ నటించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ప్రియాంక రెమ్యునరేషన్ 3 కోట్ల రూపాయలుగా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: