సినిమా వాళ్లనో... లేక క్రికెట్ వాళ్లనో... తమ యాడ్స్ లో వాడుకుంటే... కంపెనీలకు బోలెడంత సేల్స్! ఇక బోత్ సినిమా అండ్ క్రికెట్ సెలబ్రిటీస్ ని ఒకేసారి అడ్వర్టైజ్మెంట్ లో చూపిస్తే!? కెవ్వు కేకే! అదే పని చేసింది క్లియర్ అనే షాంపు తయారు చేసే కంపెనీ. ఆ మధ్య వచ్చిన విరాట్ అండ్ అనుష్క శర్మ యాడ్ సూపర్ సక్సెస్ అయింది కూడా! కాకపోతే, విచిత్రం ఏంటంటే..... ఈ క్లియర్ కంపెనీ ట్యాగ్ లైన్... నథింగ్ టూ హైడ్! బట్... విరాట్ కోహ్లి, అనుష్క తమ ఎఫైర్ ని పబ్లిగ్గా కొనసాగిస్తూనే... ఎవ్రీథింగ్ టూ హైడ్ అన్నట్టు బిహేవ్ చేశారు! చేస్తున్నారు కూడా. ఉన్నట్టుండి విరాట్ అండ్ అనుష్కని విడిపోయారు. అయితే, న్యూస్ ఏంటంటే, అనుష్క స్థానాన్ని ఇల్లీ కొట్టేసిందట! విరాట్ తో కలిసి మన గోవా గార్జియస్ కనిపిస్తుందట! మై తేరా హీరో సక్సెస్ దెబ్బకి ఫుల్ క్రేజ్ కొట్టేసిన ఇలియానా న్యాచురల్ గానే యాడ్ మేకర్స్ ఆకర్షించింది. అంత వరకూ ఓకే కాని.. విరాట్ తన గాళ్ ఫ్రెండ్ అనుష్కని కాదని ఇలియానా ఎలా పడిపోయాడా అంటున్నారు బాలీవుడ్ పండితులు! యాడ్ లో లేకపోయినా అనూతో విరాట్ రిలేషన్ కొనసాగుతుందని కొందరంటే.. కొందరు వాళ్లిద్దరి ఎఫైర్ చల్లబడ్డట్టే అంటున్నారు! ఏదీ ఏమైనా... యాడ్ చేసుకున్న ఇలియానా, ఆమెని క్యాష్ చేసుకున్న క్లియర్ కంపెనీ మాత్రం లక్కీనే! అంతే కదా?

మరింత సమాచారం తెలుసుకోండి: