ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ తన అనాలోచిత చర్యలతో తనకు తాను చేసుకుంటున్న నష్టం పై ఫిలింనగర్ లో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో జూనియర్ ప్రస్తావన కూడ లేకుండా ప్రచారాలు జరిగిపోవడం వెనుక జూనియర్ చేసుకున్న స్వయంకృత అపరాదాలే అని అంటున్నారు.  గతంలో తన అనుచరులు టీడీపీ నుంచి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీలోకి వెళుతుంటే అడ్డుకోకపోవడం ఒక తప్పు అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ ను చూసి విపరీతంగ భయపడటం జూనియర్‌ లోని పిరికి తనాన్ని సూచిస్తోంది అని అంటున్నారు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి అడ్డుకోవడం అంత సులభంగా జరిగే పని కాదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ బదులు తారకరత్నను పెద్ద స్టార్‌ను చేయాలని విశ్వ ప్రయత్నం జరిగినా జూనియర్ సమర్ధత ముందు తారక రత్న నిలవలేకపోయాడు అన్న విషయం జూనియర్ కు తెలియనిదా అని అంటున్నారు.  జూనియర్ లేకపోవడం వల్ల తెలుగుదేశo పార్టీకి కలిగే నష్టం కంటే జూనియర్ కే ఎక్కున నష్టం అని అంటున్నారు. టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి చేరువ అవుతాడు అని అనుకున్న జూనియర్ బాలయ్యతో శత్రుత్వాన్ని పెంచి పోషించుకోవడంతో ఈరోజు టాలీవుడ్ లో నాల్గవ స్థానానికి జూనియర్ కెరియర్ గ్రాఫ్ పడిపోయింది అని అంటున్నారు.  ఈ నేపధ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు మరియు సినిమాల విజయావకాశాల నేపధ్యంలో ఈ సంవత్సరం ఒక భారీ హిట్ జూనియర్ టాలీవుడ్ కు అందించలేకపోతే జూనియర్ కెరియర్ పై కూడ నీలిమేఘాలు కమ్ముకునే అవకాసం ఉంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో సరైన నిర్ణయం జూనియర్ తీసుకోపోతే తన కెరియర్ కే ముప్పు అన్న సత్యాన్ని యంగ్ టైగర్ తెలుసుకుంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: