మందు బాబుల ఆరోగ్యాన్ని చెడగొట్టే బీర్ లో కుడా ఒక సామాజిక కోణం ఉందన్న విషయం చెపితే చాలామంది నమ్మరు. కానీ ఇది నిజం అంటున్నారు శాస్త్రవేత్తలు. కాలుష్యం కోరల్లో చిక్కుకుని అనారోగ్యం బారినపడుతోన్న బాధితులకు బీర్ త్వరలో ఓ గుడ్ న్యూస్ గా మారనుంది. పరిశ్రమల వ్యర్థ రసాయనాలు, ట్రాఫిక్ వల్ల వెలువడే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఇలా రకరకాల కాలుష్య సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అనారోగ్యం పాలు అవుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల కొంత మంది అర్ధాంతరంగా తనువు చాలించడం కూడ జరుగుతోంది. ఇకపై ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకే తాజాగా ఓ పరిష్కారాన్ని కనుగొన్నట్లు క్వీన్స్ లాండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త పీటర్ గోస్ తెలిపారు.  పచ్చ రంగులో ఉండే ఈ లిక్విడ్ తయారీకి ముఖ్యంగా బీర్ తయారీకి ఉపయోగించే బార్లి గింజలనే వినియోగించినట్లు పరిశోధకులు స్పష్టంచేశారు. కాలుష్యానికి గురైన వ్యక్తి ఈ లిక్విడ్‌ని తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ లిక్విడ్ ధర సాధారణ బీర్‌ల కంటే అధికంగా ఉంటుందట. ప్రస్తుత అంచనాల ప్రకారం దీని తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ధరని పరిగణనలోకి తీసుకుంటే ఈ లిక్విడ్ ధర 5 నుంచి 20 డాలర్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే ఒక అపకారంలో కుడ మరొక ఉపకారం ఉందనే అనుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: