పవర్ స్టార్ పవన్ సాధించిన రికార్డ్ ను అవలీలగా భీట్ చేశాడు మెగా హీరో అల్లుఅర్జున్. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మెగా హీరో అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం రేసుగుర్రం మూవీ బాక్సాపీస్ వద్ద సునామిను క్రియేట్ చేస్తుంది. ఇటు ఇండియా మార్కెట్ లోనూ, అలాగే ఓవర్సీస్ మార్కెట్ లోనూ రేసుగుర్రం మూవీ కలెక్షన్స్ దుమ్ముదులుపుతుంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ మార్కెట్ లో మొదటిసారిగా అల్లుఅర్జున్ అత్యధిక కలెక్షన్స్ ను కలెక్ట్ చేశాడు. రేసుగుర్రం మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజులకే వన్ మిలియన్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ఓవర్సీస్ మార్కెట్ లో ఇప్పటి వరకూ వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో జాయిన్ అయిన మూవీలు రెండే ఉన్నాయి. ఒకటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రెండోవది అత్తారింటికి దారేది. ఈ రెండు మూవీల తరువాత మెగా హీరో అల్లు అర్జున్ వన్ మిలియం క్లబ్ లోకి జాయిన్ అయ్యాడు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో రెండో వారం కూడ గ్రేట్ కలెక్షన్స్ ను సాధించిన మూవీగా రేసుగుర్రం స్థానాన్ని సంపాదించుకుంది. రెండో వారంలోనూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది తరువాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రేసుగుర్రం మూవీ నిలిచింది. మొత్తానికి రేసుగుర్రం మూవీ సాధిస్తున్న కలెక్షన్స్ ను చూస్తుంటే జులాయి మూవీ సాధించిన కలెక్షన్స్ కంటే బెటర్ రికార్డ్ ను క్రియేట్ చేస్తుందని టాలీవుడ్ ట్రేడ్స్ చెబుతున్నారు. టాలీవుడ్ లెక్కల ప్రకారం రేసుగుర్రం మూవీ అల్లుఅర్జున్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోతుందని టాక్. అల్లుఅర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీలో నటించటానికి సిద్ధంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: