జనసేన పార్టీ పెట్టి ప్రస్తుత ఎన్నికలలో మోడీ భజన చేస్తూ కాంగ్రెస్ ను తరిమి కొట్టండి అని పిలుపు ఇస్తూ జనంలోకి దూసుకు పోతున్న పవన్ కళ్యాణ్ వ్యవహారం అల్లుఅర్జున్ కు టార్చర్ గా మారింది. బన్నీ మామగారు అల్లుఅరవింద్ వియ్యంకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ తరఫున ఎమ్ఎల్ఎ గా పోటీ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే.  అయితే పవన్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్ధుల విజయం కోసం తెలంగాణా ప్రాంతంలో ప్రచారం చేస్తున్న 45 నియోజక వర్గాల లిస్టులో బన్నీ మామగారు పోటీ చేస్తున్న నియోజక వర్గం కూడ ఉండటంతో ఈ విషయం అల్లుఅర్జున్ కు టార్చర్ గా మారింది అని అంటున్నారు.  దీనికి కారణం పవన్ ఈ నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేస్తే ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయి కాబట్టి ఆ తరువాత ఆ నియోజక వర్గంలో తనను ప్రచారానికి రమ్మని తన మామగారు చంద్రశేఖర్ రెడ్డి బలవంత పెడితే తన పరిస్థితి ఏమిటి అని బన్ని తీవ్రంగా టెన్షన్ పడుతున్నాడని టాక్. అదే విధం గా పవన్ ప్రచారం చేస్తున్న నియోజక వర్గాల లిస్టులో రామ్ చరణ్ పినమామగారు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉండటంతో పవన్ సెగ ఆయనకు కుడా తగులుతుంది అని అంటున్నారు. ఏమైనా పవన్ రాజకీయ ప్రవేశం మెగాకుటుబంలోనే కాదు ఆ కుటుంబ సభ్యుల చుట్టాలకు కుడా తలనొప్పిగా మారింది అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: