టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును పెళ్లి చేసుకునే ముందు మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ మిస్ ఇండియాగా అనేక ప్రముఖ బ్రాండ్స్ కు మోడల్ గా వ్యవహరించింది. మహేష్ తో పెళ్ళి అయిన తరువాత తన పిల్లలు మహేష్ తోనే కాలం గడుపుతూ ప్రస్తుతం సూపర్ స్టార్ భార్య స్టేటస్ అనుభవిస్తోంది.  నమ్రతకు ముంబాయ్ లోని ప్రముఖ యాడ్ ఏజెన్సీలతో ఉన్న పరిచియాలతో మహేష్ కు చాల మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్ ఎండార్స్ మెంట్లు ఆఫర్లు వరుసగా వచ్చాయి అని అంటారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈమధ్య కాలంలో మహేష్ కు మల్టీ నేషనల్ కంపెనీల బ్రాండ్ ఎండార్స్ మెంట్లు ఆఫర్లు తగ్గడంతో నమ్రత ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. లేటెస్ట్ గా నమ్రత అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఇండియన్ ఫ్యాషన్ మేగ్ జైన్ ‘రిట్జ్’ కి ఫోటో షూట్ ఇవ్వడమే కాకుండా త్వరలో కొన్ని బ్రైడల్ జ్యూయలరీ కంపెనీల ఆభరణాలకు బ్రాండ్ ఎంబాసిడర్ గా మారబోతున్నానని ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసి మహేష్ నే ఆశ్చర్య పరిచింది.  పెళ్లి తరువాత పిల్లలు పుట్టినా కూడ క్రేజ్ తగ్గని ఐశ్వర్యా రాయ్ మరియు మాధురి ధీక్షిత్ లా రాబోయే కాలంలో నమ్రత బ్రాండ్ ఎండార్స్ మెంట్లు విషయంలో మహేష్ కు గట్టి పోటీ ఇచ్చే సూచనలు ఈ ఫోటో షూట్ ను చూసినవారికి అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: