కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ శృతిహాసన్. అయితే శృతిహాసన్ టాప్ హీరోయిన్ గా కొనసాగతున్నందుకు కొంత మంది హీరోయిన్స్ కు నిద్ర కరువైందట. ఆ లిస్ట్ లో హన్సిక మొదటి వరుసలో ఉన్నారు. రీసెంట్ గా వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవే జరినట్టు కోలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. కోలీవుడ్ మీడియాలో వస్తున్న టాప్ స్టోరిగా ఈ న్యూస్ అక్కడ ప్రచారంలో ఉంది. హన్సిక, శృతిహాసన్ ను ఓ ఆడియో ఫంక్షన్ లో టార్గెట్ చేసుకుంటూ తిట్టిందట. ఆడియో ఫంక్షన్ లో తను కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోయిన్ అని, అలాగే ఇప్పుడు ఎంత మంది వచ్చినా తనకు పోటీ ఉండదని. కొందరు ఈ మధ్య కాలంలో నా ఆఫర్స్ ను చేజిక్కించుకోవటానికి తెగ ప్రయాత్నాలు చేస్తున్నప్పటి వారికి అది సాధ్యం కావటం లేదని చెప్పుకొచ్చింది. అలాగే వారసత్వాలు కొంత వరకే పనికొస్తాయంటూ చాలా ఘూటు స్పీచ్ ఇచ్చిందట. దీంతో హన్సిక ఇంతలా చెప్పింది శృతిహాసన్ గురించేనని తమిళ సినీ ప్రేక్షకులు నిర్ణయించుకున్నారు. శృతిహాసన్ ను తను ఎందుకు ఇలా టార్గెట్ చేసుకుందో ఎవ్వరికి అర్ధం కావడంలేదంట. హన్సిక చేసిన కామెంట్స్ తో కోలీవుడ్ లో శృతిహాసన్, హన్సికల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని బాహాటంగా వినిపిస్తున్న టాక్. హన్సిక చేసిన కామెంట్స్ కు శృతిహాసన్ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో అని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తుంది. మొత్తానికి కోలీవుడ్ లో ఇద్దరి టాప్ హీరోయిన్స్ మధ్య పెద్ద గొడవే మొదలైందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: