ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ఆగడు మూవీకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుంటుంది. అయితే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తి కావల్సి ఉండగా, ఈ మధ్యలో చిత్రయూనిట్ లో యాక్టర్స్ మధ్య వచ్చిన విభేధాల కారణంగా షూటింగ్ కొద్దిగా ఆలస్యంగా జరగుతుంది. మూవీకు సంబంధించిన ఇంకో షెడ్యూల్ అనంతరం ఆగడు మూవీ టాకీ పార్ట్ పూర్తిగా అయిపోనట్టేనని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారాం. ఇదిలా ఉంటే ఆగడు మూవీను ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్నదానిపై పూర్తి క్లారిటి వచ్చింది. సెప్టంబర్ 26 ఆగడు మూవీను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ నిర్ణయం తీసుకుంది. నిర్మాతలు సైతంఈ డేట్ ను ఫైనలైజ్ చేశారని టాలీవుడ్ లో క్లియర్ న్యూస్ వినిపిస్తుంది. అలాగే ఆగడు మూవీకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఆగస్ట్ 31న రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దూకుడు మూవీకు మించిన కామెడీ, అలాగే పవర్ ఫుల్ స్టోరి ఆగడు మూవీలో ఉంటుందని దర్శకుడు శ్రీనువైట్ల ఇప్పటివరకూ చెప్పుకొస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఆగడు మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించటం ఖాయం అని చిత్ర యూనిట్ అంటుంది. ఈ మూవీలో మొదటి సారిగా ప్రిన్స్ మహేష్ బాబు సరనసన తమన్న హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజ్ డేట్ తెలియటంతో ప్రిన్స్ అభిమానులు ఆగడు మూవీ కోసం ఇప్పటి నుండే వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: