అక్షయ్ కుమార్ మరోసారి సింగ్ అవతారం ఎత్తబోతున్నాడు. గతంలో "సింగ్ ఈజ్ కింగ్" అంటూ నటించిన అక్షయ్ కుమార్, ఈసారి మరో పవర్ ఫుల్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రతేకంగా మీకు అందిస్తుంది. అక్షయ్ కుమార్ నటించబోతున్న ఈ ప్రాజెక్ట్ పై బిటౌన్ లో హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. ఎందుకుంటే ఈ మూవీ డైరెక్టర్ గా ఉంటున్నది ఇండియన్ మైఖైల్ జాక్సన్ ప్రభుదేవా. అక్షయ్ కుమార్, ప్రభుదేవా లు ఇప్పటికే కలిసి రౌడీ రాథోర్ మూవీ చేశారు. ఆ మూవీ బిటౌన్ బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. అలాగే వీరిద్దరూ కలిసి మరోసారి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్ధం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సింగ్ ఈజ్ బిల్ వనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ పాజెక్ట్ కు సంబంధించిన ఫుల్ డిటైల్స్ అలాగే అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే బయటకు రానుంది. సింగ్ ఈజ్ బిల్ అనే ప్రాజెక్ట్ కు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మూవీను డైరెక్ట్ చేస్తున్న ప్రభుదేవా,దాదాపు 27 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. రెండోవది ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సౌత్ బ్యూటి ఇలియాన నటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కాస్టింగ్ కు సంబంధించిన న్యూస్ నుచిత్ర యూనిట్ అప్పుడే బయటకు చెప్పటానికి ఇష్టపడటంలేదు. ప్రభుదేవా ఇప్పటికే ఇలియానను అప్రోచ్ అయి, అక్షయ్ కుమార్ సరసన నటించేందకు కాల్షీట్స్ ను తీసుకున్నాడని బిటౌన్ లో వినిపిస్తున్న టాక్. మొత్తానికి రీసెంట్ గా ఇలియాన చేసిన హాట్ ఫోటోషూట్ కు ఆఫర్స్ రూపంలో ఫలితం దక్కుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: