అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ మహేష్ బాబు పై పగ తీర్చుకోబోతున్నాడు అంటు వార్తలు గుప్పు మంటున్నాయి. గతంలో మహేష్ ‘దూకుడు’ విడుదల సమయంలో ఆ సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ తన ట్విట్టర్ ద్వారా అల్లు శిరీష్ కామెంట్స్ చేసి ప్రిన్స్ అభిమానుల కోపానికి గురియ్యాడు. దీనితో రెచ్చిపోయిన మహేష్ అభిమానులు తమ హీరో గురించి మాట్లాడే అంతటి గొప్ప వాడివా కెరీర్ లో నువ్వేం సాధించావు అంటూ అప్పట్లో సీరియస్ గా కౌంటర్స్ ఇచ్చారు. ఇప్పుడు అది మనసులో పెట్టుకుని అల్లు శిరీష్ ఈ వారం విడుదల కాబోతున్న తన ‘కొత్త జంట’ సినిమాలో మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో’ సినిమా పై సెటైర్లు వేయించాడని టాలీవుడ్ టాక్. ఈ మేరకు మహేష్ బాబు పాత్రను సంపూర్ణేష్ బాబుపై చిత్రీకరించారని, అయితే అల్లు అరవింద్ జోక్యంతో ఆ ట్రాక్ తొలిగించారని తెలుస్తోంది. కాని ఆ సన్నివేశాలను వేరే వారిపై చిత్రీకరించారని అంటున్నారు. అదంతా అల్లు శిరీష్ ఇచ్చిన ఐడియా అని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవముంది అనేది సినిమా విడుదల అయితే గానీ తెలియదు. విడుదలైన మొట్టమొదటి చిత్రం ‘గౌరవం’ తో గంపెడు అగౌరవాన్ని నెత్తిన పెట్టుకున్న అల్లు శిరీష్‌ ఇటువంటి సాహసాన్ని చేస్తే మళ్ళీ మహేష్ బాబు అభిమానుల దగ్గర నుంచి గట్టి ప్రతిఘటన వచ్చే అవకాశాలే ఉన్నాయి అని అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: