సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరికైనా ఏదో ఒకరోజు స్టార్ తిరుగుతుంది..కాని కొంతమంది మాత్రం ఎన్ని పెద్ద సినిమాలు చేసిన ఇంకా చాలా చిన్న వాళ్ళుగా ఉండిపోతున్నారు. 24 క్రాఫ్ట్స్ లో పర్ఫెక్ట్ గా పనిచేస్తేనే సినిమా అవుతుంది. అలా అన్ని శాఖల్లో కల్లా అతి కష్టమైనది లైట్ బోయ్ జీవితం.. ఒక సినిమాకి లైట్ బోయ్ ఎంత కష్టపడతాడో ఈరోజు ఎపిహెరాల్డ్.కామ్ ఎడిటోరియల్ లో చూద్దాం. సిల్వర్ స్క్రీన్ మీద సినిమా అందంగా కనపడాలంటే కేవలం ఒక డైరక్టర్.. ప్రొడ్యూసర్.. హీరో..హీరోయిన్ ఉంటే సరిపోదు.. 24 క్రాఫ్ట్స్ లో ఎంతో మంది తమ ఎఫర్ట్ ని పెడితేనే మంచి అవుట్ పుట్ వస్తుంది. ఇక ఈ 24 శాఖల్లో అత్యంత కష్టమైనది లైట్ బోయ్ వర్క్.. ఎందుకంటే 1కేబి నుండి దాదాపు 100 కేబి వరకు లైట్స్ ని వాడుతుంటారు వాటినంతటిని వారి చేత్తో పట్టుకుని సినిమా మంచిగా రావడానికి కృషి చేస్తారు లైట్ బోయ్స్.. సినిమాకు లైట్ బోయ్ చేసే కష్టం ఇంతా అని చెప్పలేం గాని.. ఒకవిధంగా చెప్పాలంటే అందరికన్నా ఎక్కువనే అని చెప్పొచ్చు. ఇంత శ్రమ పడినా డైరక్టర్ గాని.. హీరో గాని అందరు చిరాకు వస్తే మొదట కోపం చూపించేది లైట్ బోయ్ మీదే.. దాదాపు పరిశ్రమలో ఉన్న ఎన్నో వందల మంది లైట్ బోయ్స్ చాలా పెద్ద సినిమాలు, వందల సినిమాలకు పని చేసి మంచి ఎక్స్ పీరియెన్స్ ని సంపాధించారు. అయినా సరే వారు ఇంకా చిన్న వారిగానే ఉన్నారు. ఎవరైనా సినిమా గురించి చెప్పాలంటే లైట్ బోయ్ నుండి డైరక్టర్ వరకు అంటారు. ఎందుకంటే సినిమాకు పనిచేసే 24 క్రాఫ్ట్స్ లో ఈ లైట్ బోయ్సే చివరన ఉంటారు కాబట్టి. ఇక ఇప్పుడు కొంతమంది డైరక్టర్లు ఈ కార్మికుల పొట్ట కొట్టేలా లైట్స్ లేకుండా సినిమాలను తీసేస్తున్నారు.. డే లైట్ తోనే సినిమాలను తీసి వీరి పొట్ట కొడుతున్నారు. లైట్ బోయ్ తన పట్టుకునే లైట్ ఎంత బరువున్నా చాలా ఓపికతో సినిమా అంటే ఉన్న ఇష్టం మీద ఎంతో నమ్మకంతో పనిచేస్తాడు. అయినా వారి శ్రమను పరిశ్రమ అంతగా గుర్తించట్లేదు. సినిమాకు పనిచేసే అన్ని శాఖల్లో ముఖ్యంగా టెక్నికల్ టీం కి వస్తే కేవలం కెమెరా.. ఎడిటింగ్ వీటికి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. తమలో ఉన్న ఒక కొత్త ప్రపంచాన్ని ఆడియెన్స్ కి కూడా చూపించాలని తాపత్రయంతో ఇంటిని వదిలి ఎన్నో కష్టాలు పడుతూ కృష్ణా నగర్ లో ఉంటున్నారు సిని కార్మికులు. వారిలో డైరక్టర్లు అవుదాం అని వచ్చిన వారు.. హీరో అవుదాం అని వచ్చిన వారి సంఖ్య అయితే లెక్కే లేదు. ఇలా వీరిలో తాము అనుకున్న పని దొరకనప్పుడు చాలా మంది లైట్ బోయ్ గా పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇక స్టార్ డైరక్టర్లుగా కొంత కాలం పేరు ప్రఖ్యాతలు సంపాధించిన కొంతమంది పాత దర్శకులు కూడా పరిశ్రమలో లైట్ బోయ్ గా కెరియర్ స్టార్ చేసిన వారు కొందరున్నారు. సో ఎన్ని శాఖలున్నా సినిమా కలర్ ఫుల్ గా మంచి లైటింగ్ తో అందరిని ఆకట్టుకోవాలంటే సినిమా స్కోప్ కి చక్కని లైటింగ్ కూడా అవసరమే.. మరి ఆ లైట్ ని ఎంతో శ్రమ పడుతున్నా ఆందంగా పని చేసుకుంటూ పోతున్న మన టాలీవుడ్ లైట్ మెన్స్ కి హ్యాట్ ఆఫ్ చెబుతూ వారు ఇప్పుడు చిన్న వాళ్ళు కావొచ్చుగాని ఏదో ఒకరోజు చాలా పెద్ద వారు తప్పకుండా అవుతారని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: