ప్రభాస్ అక్టోబర్ 23, 1979లో పుట్టారు. అంటే ఈ నెల్లోనే 33 ఏళ్ళను పూర్తిచేసుకుంటారన్నమాట. కుర్ర హీరోలందరూ పట్టుమని పాతికేళ్ళకే పెళ్ళి ప్రస్తావన తెస్తుంటే ప్రభాస్ మాత్రం ఇప్పుడే ఎందుకు? అని ‘రెబల్’ ఆడియో వేడుకలో అన్నాడు. ప్రభాస్ విలేకరులతో మాట్లాడుతూ ‘‘రాజమౌళి సినిమా అంటే చాలా బరువుబాధ్యతలుంటాయి. అలాంటిది ఈ సమయంలో పెళ్ళి చేసుకుంటే దేనికీ న్యాయం చేయలేను’’ అని అన్నాడు. రాజమౌళి ‘మగధీర’, ‘ఈగ’తో పాటు దేన్నీ ఏడాదిన్నర తక్కువ కాలంలో తీయలేదు.  అదే వాస్తవమైతే ప్రభాస్ జీవితంలో ఇంకో ఒకటిన్నరేళ్ళు పెళ్ళి మాటే ఉండదు. అంటే ఈ రెబల్ హీరోకి పెళ్ళి కల 35 ఏళ్ళకు గానీ రాదేమో. అప్పటి వరకు అంతా బాగానే ఉంటుందనుకోవడం పొరపాటేనేమో.  35 ఏళ్ళప్పుడు అమ్మాయిని ఇచ్చేవారు ప్రభాస్ డబ్బును చూసి,హోదాను చూసి మురిసిపోతారేమోగానీ, అల్లుడుగారి వయసును చూసి మురిసిపోరు. ఈ విషయాన్ని ప్రభాస్ గుర్తుంచుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: