స్టార్ హీరోలు ఓ పొజిషన్ కు వెళ్ళిన తరువాత వాళ్ళు, వాళ్ళ కొడుకులను, కూతుళ్ళను ఇండస్ట్రీకు పరిచయం చేయటం కోసం దాదాపు పది సంవత్సరాల నుండే తెగ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే సోనాక్షి సిన్హా ను బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు పరిచయం చేయటం కోసం దాదాపు ఏడు సంవత్సరాల నుండే కసరత్తులు జరిగాయంట. అలాగే అనిల్ కపూర్ తన కుమార్తెను బిటౌన్ ఇండస్ట్రీకు పరిచయం చేయటానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలన ఉండే తెగ ఆలోచిస్తూ వచ్చాడట. ఈ విధంగా స్టార్ హీరోల కూతుర్లు ఇండస్ట్రీకు పరిచయం కావాలంటే తండ్రులు ఎంతలా కష్టపడతారో తెలుసుకుంటేనే ఆశ్ఛర్యమేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో గోవింద కూతురు నర్మద కూడ త్వరలోనే ఇండస్ట్రీకు పరిచయం కాబోతుంది. గత మూడు సంవత్సరాల నుండి నర్మద వద్దకు 30 స్టోరీలు వచ్చాయంట. వాటన్నింటిని నర్మద తోసిపుచ్చింది. అలాగే నర్మద బిటౌన్ సెలబ్రిటి హీరోలతో డేటింగ్ చేస్తుందని హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. కూతురి ఫ్రీడంకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని గోవిందకు, కూతురి డేటింగ్ వ్యవహారం తెలిసినా కూడ కామ్ గానే ఉంటున్నాడట. దీంతో కూతురి స్పీడు చూసిన తండ్రి వెంటనే ఏదొఒక మూవీలో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రి ఇప్పించాలని అనుకున్నట్టు సమాచారం. ఈ విషయమై కొంతమంది డైరెక్టర్లతో నర్మదతో స్టోరి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బాలీవుడ్‌లో నర్మద ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్నమాట. కాకపోతే మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: