ఒకప్పుడు హాస్య హీరోగా ఒక వెలుగు వెలిగిన విజయనిర్మల కుమారుడు నరేష్ ఆ మధ్య చాల వెనక పడిపోయినా క్యారెక్టర్ యాక్టర్ గా మారి ఇప్పుడు మళ్ళీ బిజీ స్టార్ గా మారిపోయాడు. ఈమధ్య విడుదలైన ‘చందమామ కథలు’ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కూడ చేసి మళ్ళీ ప్రేక్షకులకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాడు. గత పదిహేనేళ్లుగా బీజేపిలో పనిచేసిన నరేష్ పార్టీలోంచి బయటకు వచ్చాక మరి వేరే పార్టీలోకి వెళదామని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో చాలామంది సినిమా సెలెబ్రెటీలు రకరకాల పార్టీలకు ప్రచారం చేస్తున్నా నరేష్ మాత్రం తన సినిమాలకే పరిమితం అవుతూ మౌనంగా ఉంటున్నాడు. ఈ సందర్భంలో నరేష్ నేటి రాజకీయాలపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు.  వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లేంత ఆర్థిక స్థోమత తనకు లేదని ఆ పార్టీ పై సెటైర్లు వేసాడు. అదేవిధంగా బీజేపిలో వున్న గ్రూపు, కుల తగాదాల కారణంగానే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానని చెబుతూ క్లీన్ పాలిటిక్స్ కోరుకునే తనకు పవన్ కల్యాణ్ రాక ఆశని రేకెత్తించింది అంటున్నాడు. ఇక్కడి వరకు అంతాబాగానే వుంది కానీ ఎందుకో ఉన్నట్లుండి నరేష్ దృష్టి చిరంజీవిపై పడింది. తాను ఓ 100 సినిమాలు చేసిన హీరోని మాత్రమే కానీ రాజకీయాల్లో చేరిన పొలిటికల్ జోకర్‌ని మాత్రం కాదు అంటు చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని సెటైర్లు వేసాడు. అంతేకాదు అంతటితో ఆగకుండా నేరుగా చిరంజీవిపై దాడి మొదలెట్టాడు.  పీఆర్పీ స్థాపించినప్పుడు పబ్లిక్ నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించిన చిరంజీవి ఆ నిధులని ఎంత ఖర్చుపెట్టాడు? అని ఎవరూ ప్రశ్నించరేమిటి అంటు ప్రశ్నలు వేస్తున్నాడు. నాయకులని ప్రశ్నిస్తాను అని రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా మారుతున్న పరిస్థుతులలో రాజీ పడిపోతూ ఉంటే సీనియర్ నరేష్ కామెంట్స్ ఎవరు పట్టించుకుంటారు అన్న విషయం నరేష్ కు తెలియదు పాపం.  

మరింత సమాచారం తెలుసుకోండి: