తమిళ హీరో విశాల్ కోలీవుడ్ హీరో అయినా ఇతడికి టాలీవుడ్ లో కుడా క్రేజ్ ఉంది. ఈ హీరో షూటింగు స్పాట్లో గాయపడ్డాడు అనే వార్తలు వస్తున్నాయి. ‘పూజై' అనే తమిళ చిత్రం షూటింగ్ జరుగుతుండగా విశాల్ చేతికి తీవ్రమైన గాయం అయింది. విశాల్‌ను వెంటనే యూనిట్ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ గాయానికి వైద్యులు 22 కుట్లు వేసి వైద్యం చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం చెన్నైలోని మోహన్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది అని అంటున్నారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ కమల్ కన్నన్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఈ గాయం జరిగింది అని అంటున్నారు. వైద్యులు వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా షూటింగ్ ఆపడానికి విశాల్ ఇష్ట పడటం లేదని, ఈ చిత్రానికి నిర్మాత కూడా విశాల్ కావడంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందనే కారణంతో ఈ షూటింగ్ కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలం లో హీరో ల మధ్య పోటి పెరిగి పోవడంతో పెద్ద హీరోల నుండి చిన్న హీరోలవరకు రిస్క్ తీసుకుని ఫైట్లు చేయడం జరుగుతోంది. దీనివల్ల హీరోలకు జరిగే ప్రమాదాల సంఖ్య కుడా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో సరియైన హిట్ లేక భాద పడుతున్న విశాల్ నటిస్తున్న ఈ సినిమా దీపావళికి విడుదల అవుతుంది అని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: