హాలీవుడ్ సినిమాల ప్రభావం రోజురోజుకు బాలీవుడ్ లో ఎక్కువై పోతోంది. ఇప్పటికే సహజీవనం సర్వసాధారణమైపోయిన సినిమా సంస్కృతిలో నిర్మాతలు బాగా డబ్బు ఇస్తే చాలు ఎటువంటి లిప్ లాక్ సీన్స్ కు అయినా ఓకె చెప్పేస్తున్నారు మన బ్యూటీలు. సెన్సార్ వారు కూడ ఈ లిప్ లాక్ సీన్స్ మన సంస్కృతి కాకపోయినా మారుతున్న పరిస్థితులలో వారు కూడ మారిపోయి ఆ సీన్స్ కు పచ్చ జెండా ఊపేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు హీరో హీరోయిన్స్ మధ్య మాత్రమే లిప్ లాక్ సన్నివేశాలను చూసాం. కానీ దీనికి విరుద్దంగా ఈమధ్య ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన ఐఫా వేడుకలో కరీనా కపూర్, బిపాసా బసు మరో వికృతమైన కొత్త పోకడకు తెర లేపారు. సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు కరచాలనం చేసుకోవడం, మరీ క్లోజ్ ఫ్రెండ్సయితే ఆలింగనం చేసుకోవడం సహజం. కానీ ఈ ఇద్దరు స్నేహితురాళ్లు ఐఫా వేడుకల్లో కలుసుకొని ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయేలా లిప్‌లాక్ చేసేసుకున్నారు. ఇప్పుడు వీరి లిప్‌లాక్ సర్వత్రా హాట్ న్యూస్ గా మారింది. హలీవుడ్‌లో లీసా, కేటీఫెర్రీ లాంటి నటీమణులు ఇలాగే గతంలో లిప్‌లాక్ చేసుకున్నారు. అక్కడ ఇవన్నీ సహజం. కానీ మనదేశంలో ఇటువంటి సంఘటనలు ఇప్పటి వరకు జరగలేదు.. మన సంస్కృతికే వీరిద్దరూ మచ్చ తెచ్చారు అంటూ మీడియాలో వీరిద్దరి పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఇవేమీ పట్టించుకునే స్థితిలో కరీనా కపూర్ బిపాసా బసులు లేరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: