ప్రస్తుతం రజనీకాంత్ నటించిన లేటెస్ట్ అండ్ అప్ కమింగ్ ఫిల్మ్ కొచ్చాడయన్ మూవీ అతి కొద్ది రోజుల్లోనే థియోటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ టెక్నాలజీ పరంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ మూవీలో నటించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలపై ఎటువంటి ఆధారాలు లేవంటూ తేలిపోయాయి. అయితే రజనీకాంత్ తన తరువాతి మూవీను కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీకు సంబంధించిన టైటిల్ కు, రజనీకాంత్ ప్రాణాలకు లింకు పెడుతూ కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రజినీకాంత్, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ మూవీకు ‘లింగా’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ఇక్కడ ఓ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే రజినీకాంత్ మనవడి పేరు లింగా. అంటే ధనుష్, ఐశ్వర్యల రెండవ కుమారుడు అని. నిజానికి గతంలో రాణా అనే మూవీను స్టార్ట్ చేసినప్పుడు రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు. ఇప్పుడు ఆ మూవీ టైటిల్ నే మార్చేసి లింగ అనే పేరును ఫిక్స్ చేశారు. దీంతో రజనీ అభిమానులు, "మా అభిమాన హీరో ఆరోగ్యమే మాకు ముఖ్యం. రాణా పేరును మార్చిందే మంచిది. లేకుండా రజనీను మరోలా చూడలేము" అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. కె.ఎస్.రవికుమార్ కూడ రాణా టైటిల్ ను మార్చటానికి కారణం రజనీకాంత్ ఆరోగ్య దృష్టిను ఉద్ధేశించుకొనే అంటూ తమిల్ టాబ్లాయిడ్ లో మాట్లాడినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. రజినీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: