కొందరు దర్శకులు తెలుగు, తమిళ ఇండస్ట్రీలకి సరిగ్గా సరిపోతే.... మరికొందరు బాలీవుడ్ కి బాగా పనికొస్తారు. అలాంటి వారిలో ఒకరే మన శేఖర్ కమ్ముల. మన రెగ్యులర్ తెలుగు సినిమాలకి భిన్నంగా ఆయన మూవీస్ వుంటాయ్. ఇంకా క్లియర్ చెప్పుకోవాల్సి వస్తే..... శేఖర్ కమ్ముల కాన్సెప్ట్స్ మల్టీప్లెక్స్ మార్కెట్ విపరీతంగా వుండే బాలీవుడ్ కైతే బాగా సూటవుతాయ్! ఆరు పాటలు, నాలుగు ఫైట్స్ అన్నది ఆయన సినిమాల్లో ఎప్పడూ కనిపించదు! మే ఫస్ట్ నాడు.... అనామిక సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు శేఖర్. ఈ సినిమాకి ఒరిజినల్ వర్షన్ హిందీ సినిమా కహాని! అయితే, ప్రస్తుతం ఓ హిందీ రీమేక్ తో మన ముందుకు వస్తోన్న ఈ సెన్సిబుల్ డైరెక్టర్ త్వరలో డైరెక్ట్ హిందీ మూవీతోనే రానున్నాడు! ట్విస్ట్ ఏంటంటే... హిందీ నుంచి తెలుగులోకి ఓ రీమేక్ చేసిన వెంటనే... తెలుగు నుంచి మరో సినిమా హిందీలోకి రీమేక్ చేస్తాడట! దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఈ సంవత్సరం శేఖర్ కమ్ముల బాలీవుడ్ లో ప్రవేశించడానికి అంతా సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. హ్యాపీ డేస్ చిత్రాన్ని హిందీ లో రిమేక్ చేయనున్నట్లు శేఖర్ తెలిపారు. అయితే ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే సల్మాన్ ఖాన్ తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రైట్ నౌ.... హిందీ హ్యాపిడేస్ లో నటించేందుకు కావాలసిన నటుల ఎంపిక జరుగుతోంది. హిందీ లో శేఖర్ కమ్ముల ఓ చిత్రం చేస్తున్నారని గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అవి ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ‘ప్రతీసారి హ్యాపీ డేస్ ను హిందీ లో చెయ్యాలని అనుకొంటున్నాను. అయితే తెలుగు లో కొన్ని చిత్రాల వల్ల కొద్దిగా అది ఆలస్యమైంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలకు కొంత బ్రేక్ ఇచ్చి, హిందీ చిత్రాలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. సల్మాన్ ఖాన్ తో కలిసి చిత్రాన్ని నిర్మించడం నాకెంతో సంతోషంగా ఉంది.`` అంటున్నాడు శేఖర్ కమ్ముల! ఖాన్ అండ్ కమ్ముల చేయనున్న ఆ జాయింట్ వెంచర్ ఎలా వుండబోతోందో కాని.... ప్రస్తుతమైతే... నయనతార ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘అనామిక’ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: