ఇంకా పెళ్లి కాని ఓ హాట్ సౌత్ బ్యూటీ... హిందీ సినిమాలో మ్యారీడ్ మేడమ్ గా కనిపించనుందట! దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. తెలుగు యూత్ ను తన వెండి వెన్నెల అందాలతో ముంచెత్తిన చందమామ.... కాజల్ అగర్వాల్! హిందీలో సింగం, ఆ తరువాత స్పెషల్ చబ్బీస్ అనే మరో సినిమా చేసింది! అయితే, కాజల్ నటించిన ‘స్పెషల్ చబ్బీస్′ సినిమా వచ్చి సంవత్సర కాలం దాటిన తర్వాత ఇప్పుడు మరో సినిమాకి సైన్ చేసింది. హిందీలోకి రిమేక్ చేస్తున్న ‘సీస్ ఫైర్’ అనే ఇరానీ చిత్రంలో కాజు కనిపించనుంది! శర్మన్ జోషి ఈ సినిమాలో హీరోగా చేయనున్నాడు.... సీస్ ఫైర్ అనే సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి అజయ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్ళైన ఇద్దరు... విడాకులు తీసుకున్న తరువాత... మళ్ళీ ప్రేమ లో ఎలా పడ్డారు? అన్న అంశం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. తన తాజా సినిమాలో పెళ్లైన శ్రీమతిగా మతిపోగొట్టనున్న కాజల్.... నిజ జీవితంలో మాత్రం బాగా వెనకబడింది. చెల్లి నిషా అగర్వాల్ కొన్ని నెలల క్రితమే మూడు ముళ్లు వేయించుకున్నా... తనకు మాత్రం ఆ మూడ్ రాలేదంటూ సింగిల్ గా వుండిపోయింది! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రంలో, ధనుష్ తో కలిసి మరో తమిళ చిత్రంలో నటిస్తోన్న కాజల్ ఈ హిందీ సినిమా కూడా కంప్లీట్ చేసేదాకా పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదన్నమాట! అయినా కెరీర్ చక్కగా సాగుతుంటే... పెళ్లి, హనీమూన్, పిల్లలు... ఇవెందుకు చెప్పండి!? అంటూ మీడియాను ఎదురు ప్రశ్న వేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: