ఇది బాలయ్య నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ కాదు. బాలకృష్ణ కూడ అద్దె ఇంటి వేటలో ఉన్నాడు. వందల కోట్ల ఆస్థికి అధినేత అయిన బాలయ్యకు కూడ అద్దె ఇంటి వేట తప్పలేదు. ఇక వివరాలలోకి వెళితే ప్రస్తుతం హిందూపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన నందమూరి బాలకృష్ణ స్థానిక పాండురంగ నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకోవాలని నిర్ణయించు కున్నారట. ప్రచార కార్యాక్రమాలను చేపట్టేందుకు, పర్యవేక్షించేందుకు ఇల్లు అవసరమని ఆయన భావించారు అని టాక్. దీనితో మంచి అనువైన ఇంటిని వెతికే పనిలో బాలయ్య అనుచరులు నిమగ్నమయ్యారు. మరో ప్రక్క బాలకృష్ణ ప్రచారంలో తన అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉండటంతో ప్రస్తుతం బాలయ్య మంచి జోష్ మీద ఉన్నాడు. కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ప్రచార బాధ్యతను నిర్వహిస్తున్న బాలయ్యకు హిందూపురంలో ప్రచారం చేయడానికి సమయం దొరకక పోవడంతో బాలయ్య భార్య కుమార్తెలు బాలయ్య తరపున డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ హడావిడి చేస్తున్నారు.. ఈ వార్తలు ఇలా ఉండగా బాలయ్య వీరాభిమానులు కొంతమంది సమరసింహారెడ్డి, సింహా, లెజెండ్‌ తదితర చిత్రాల్లో బాలయ్య నటనకు వినియోగించిన ఆయుధాల బొమ్మలను తయారు చేయించి ఆ వస్తువులను బాలయ్యకు బహుమతిగా ఇస్తూ మురిసి పోతున్నారు. మరికొందరు అయితే బాలయ్య తాజా చిత్రం 'లెజెండ్‌'లోని ఆయన వేషధారణను అనుకరిస్తూ సందడి చేస్తున్నారు. జరుగుతున్న ప్రచార సరళిని గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం బాలయ్య హిందూపురం లో విజయం సాధించడం ఖాయం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: