స్టార్ డైరెక్టర్ రాజమౌళిని ఫ్లాప్ భయం వెంటాడుతోంది అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఈమాటలు క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనడo సంచలనంగా మారింది. ఈ మాటలు మీడియాకు ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల అన్నారు. అంతే కాదు తెలుగు సినిమా స్టాండర్డ్ పెరగకపోవడానికి కొత్తరకం సినిమాలకి ఆదరణ లేకపోవడానికి కారణం కొందరు అగ్ర దర్శకులే అని శేఖర్‌ కమ్ముల సంచలన వ్యాఖ్యలు చేసారు.  ప్రస్తుత పరిస్థితులలో టాప్‌ డైరెక్టర్లు పూను కుంటే తప్ప రొటీన్ సినిమాల పోకడలకు అడ్డుకట్ట పడదని అని అంటూ మనకు రాజమౌళి త్రివిక్రమ్ లాంటి గొప్పదర్శకులున్నా వారి మీద సూపర్ హిట్‌ ఇవ్వాలనే ప్రెషర్‌ ఉండడం వల్ల కమర్షియల్‌ చిత్రాల పంధాను విడిచి పెట్టలేకపోతున్నారని కామెంట్ చేసాడు శేఖర్ కమ్ముల.  అయితే రాజమౌళి, త్రివిక్రమ్‌ లాంటి వారు ఎలాంటి సినిమాలైనా తీయగల సమర్ధులని, కానీ వారినుంచి వచ్చే ప్రతి సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకంతో అటు నిర్మాతలు ఇటు ప్రేక్షకులు ఉన్నారని శేఖర్ అభిప్రాయ పడుతున్నారు. రాజమౌళి తీసిన ‘మగధీర’, ‘ఈగ’ లాంటి సినిమాలు విభిన్నమని తాను అనుకోవడం లేదని అంటూ చిన్న సినిమాలతోనే మార్పు వస్తుందని, రెగ్యులర్‌ తెలుగు సినిమాలకి భిన్నమైన వాటిని రాజమౌళి త్రివిక్రమ్ లాంటి వారు తీయడానికి ప్రయత్నిస్తే కానీ టాలీవుడ్ లో మార్పులు రావు అని శేఖర్ కమ్ముల చేసిన కామెంట్స్ నేడు టాపిక్ అఫ్ టాలీవుడ్ గా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: