క్యూట్ హీరోయిన్ సమంత ప్రేమతో ఇచ్చిన ఆఫర్ అక్కినేని నాగార్జునకు షాక్ ఇచ్చిందని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. సాధారణంగా ఒక్క సినిమా హిట్ అయితే చాలు పారితోషికo విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపెడతారు హీరోయిన్స్. ఈ విషయంలో కూడ సమంత ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ లలో మంచి మార్కెట్ ఉన్న సమంత పారితోషికం కోటి దాటి పోయింది.  అయితే ఇపుడు సమంత ఉన్నట్టుండి అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ కు ఒప్పుకున్న పారితోషికం కంటే తక్కువ అమౌంట్ చార్జ్ చేస్తూ పరిశ్రమ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఇదే విషయం సమంతను అడిగితే ‘నాకు కావాల్సింది డబ్బు కాదు, మంచి పాత్రలు కావాలి' అని సమాధానం ఇస్తోందట.  మంచి పాత్రలు, చిన్న సినిమాలు చేయాల్సిన సమయం వస్తే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని కూడా చేయడానికే రెడీ అని గతంలో చాల సార్లు సమంత ప్రకటించింది. ఈ ఉద్దేశాలకు అనుగుణంగా సమంత అక్కినేని కుటుంబానికి భారీ ఆఫర్ ఇచ్చింది అని భావించినా, మార్కెట్ బిజినెస్ విషయంలో సంచలనాలు సృష్టిస్తున్న ‘మనం’ సినిమా సమంత దృష్టిలో చిన్న సినిమా ఎలా అయింది అంటు ఫిలింనగర్ లో సమంత పై సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు ఇప్పటికే ‘మనం’ తో కలుపుకుని చైతన్యతో మూడు సినిమాలు చేసిన సమంత చైతు పై ప్రేమతో ఇలా భారీ డిస్కౌంట్ నాగార్జునకు ఇచ్చిందా? లేదంటే నిజంగానే ‘మనం’ సినిమాలో తన పాత్ర సమంతకు అంత బాగా నచ్చిందా? అనే విషయం పై రకరకాల సెటైర్లు ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: