తాను ప్రేమించిన వాడికోసం కోటి రూపాయలు త్యాగం చేసి సంచలనం సృష్టిస్తోంది అమలాపాల్. కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ ను ప్రేమించి జూన్ లో పెళ్ళిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈలోగా ఆమె ఒప్పుకున్న సినిమా కమిట్‌మెంట్స్‌ అన్నీ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా హీరో హవీష్ తో ‘వస్తా నీ వెనుక’ సినిమా షూటింగ్‌ కూడా త్వరగా కంప్లీట్‌ చేయాలనుకుంది.  కానీ ఏప్రిల్‌లో మొదలు కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్‌కి వాయిదా వేయడంతో అమలా పాల్‌ వారి మీద కోప్పడి ఈ చిత్రం నుంచి వైదొలగింది అని వార్తలు వస్తున్నాయి. అమల ఈ సినిమాలో ఏమాత్రం పేరులేని హవీష్ తో నటించడానికి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ కోటి రూపాయలు పారితోషికంగా తీసుకోవడం కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ పారితోషికం మొత్తాన్ని ముందుగా తనకు సినిమా ప్రారంభం కాకుండానే తనకు ఇవ్వాలని అమల పట్టు పట్టిందని అప్పట్లో వార్తలు కూడ వచ్చాయి. సినిమా ప్రారంభం ఆలస్యం అవుతూ ఉండటంతో అమల ఆ డబ్బుని కూడా ఆమె వదిలేసుకుంది. కోటి రూపాయల కోసం పెళ్లి వాయిదా వేసుకుంటుందిలే అనుకున్న ‘వస్తా నీ వెనుక’ టీమ్‌ ఇప్పుడు అమలా పాల్‌ ఇచ్చిన షాక్ తో మరో ప్రముఖ హీరోయిన్‌ వేటలో పడ్డారు అని టాక్.  వాస్తవాలు ఇలా ఉంటే తనని సినిమానుంచి తప్పించామని చెప్పుకుంటోన్న ఆ చిత్ర బృందంపై అమలా పాల్‌ మండిపడింది. చెప్పిన టైమ్‌కి సినిమా స్టార్ట్‌ చేయకుండా తన టైమ్‌ వేస్ట్‌ చేశారని, ఈ కారణంగా తన డేట్స్‌ వేరే సినిమాకి ఇవ్వలేకపోయానని అమలా పాల్‌ గగ్గోలు పెడుతోంది. ఏమైనా ప్రియుడి కోసం కోటి రూపాయలను వదులుకుని అమల భారీ త్యాగమే చేసింది అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: